షాకింగ్.. మహిళకు 31 సార్లు కరోనా పాజిటివ్
A woman in Rajasthan has tested COVID-19 positive 31 times in the last five months.చైనాలోని వుహన్ నగరంలో పుట్టిన
By తోట వంశీ కుమార్ Published on 23 Jan 2021 9:55 AM ISTచైనాలోని వుహన్ నగరంలో పుట్టిన కరోనా వైరస్ ప్రపంచాన్ని వణికిస్తోంది. పేద-ధనిక అన్న తేడా లేకుండా అందరూ ఈ మహమ్మారి బారిన పడుతున్నారు. ప్రపంచ వ్యాప్తంగా కోట్ల మంది ఈ మహమ్మారి బారిన పడగా.. లక్షల్లో ప్రాణాలు కోల్పోయారు. ఇప్పుడిప్పుడే ఈ మహమ్మారి అంతం చేయడానికి వ్యాక్సిన్లు అందుబాటులోకి వస్తున్నాయి. అయితే.. ఓ మహిళకు ఎలాంటి లక్షణాలు లేకుండా గత ఐదు నెలల్లో 31 సార్లు కరోనా పాజిటివ్‌గా రావడం సంచలనం రేపుతోంది. దీంతో ఆమె ఆరోగ్యం క్షిణిస్తోంది. కరోనా వైరస్ అంతుచిక్కని ప్రవర్తనకు అక్కడి డాక్టర్లు కూడా ఆశ్చర్యపోతున్నారు. ఇది ఎక్కడో కాదు మనదేశంలోని రాజస్థాన్‌లోనే.
రాజస్థాన్‌కు చెందిన అప్నాఘర్ ఆశ్రమానికి చెందిన శారద అనే మహిళకు 5 నెలల్లో 31 సార్లు కరోనా పాజిటివ్‌గా రావడం సంచలనం రేపుతోంది. 31 సార్లు కోవిడ్ పాజిటివ్ వచ్చినా జ్వరం, నీరసం, దగ్గు, జ్వరం వంటి కరోనా లక్షణాలు శారదలో కనిపించడం లేదు. భరత్‌పూర్ జిల్లాలోని ఆర్‌బీఎం ఆస్పత్రిలో ప్రస్తుతం ఆమెకు చికిత్స జరుగుతోంది. గత ఏడాది ఆగస్టు 20వ తేదీన ఆమెకు తొలిసారి కరోనా పరీక్ష చేయగా కరోనా పాజిటివ్ వచ్చింది. చికిత్స అందించిన తర్వాత పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఇలా ఇప్పటి వరకు 31 సార్లు పరీక్షలు నిర్వహించగా ప్రతీసారి ఆమెకు కరోనా పాజిటివ్‌గానే రిపోర్టులు వస్తున్నాయి. ఒక వ్యక్తి శరీరంలో కరోనా వైరస్ ఇంత సుదీర్ఘకాలం ఉండటం అనేది ఇప్పుడు వైద్య వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.