భారీ తొక్కిసలాట.. 39 మంది మృతి.. 15 రోజుల ముందే ఎలా చెప్పాడు?

తమిళనాడులో భారీ తొక్కిసలాట జరిగిన విషయం తెలిసిందే. హీరో విజయ్‌.. తన పొలిటికల్‌ క్యాంపెయిన్‌లో భాగంగా కరూర్‌ జిల్లాలో ..

By -  అంజి
Published on : 28 Sept 2025 10:40 AM IST

Tweet Viral, netizen, Karur stampede, Tamilandu, TVK

భారీ తొక్కిసలాట.. 39 మంది మృతి.. 15 రోజుల ముందే ఎలా చెప్పాడు?

తమిళనాడులో భారీ తొక్కిసలాట జరిగిన విషయం తెలిసిందే. హీరో విజయ్‌.. తన పొలిటికల్‌ క్యాంపెయిన్‌లో భాగంగా కరూర్‌ జిల్లాలో నిర్వహించిన ర్యాలీలో భారీ తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో 39 మంది కన్నుమూశారు. పెద్ద ఎత్తున కార్యకర్తలు గాయపడ్డారు. కాగా ఈ దుర్ఘటన నేపథ్యంలో ఆనంద్‌ అనే పేరుతో గల ట్విటర్‌ అకౌంట్‌లోని ట్వీట్‌ ప్రస్తుతం తెగ వైరల్‌ అవుతోంది. సెప్టెంబర్‌ 13 నాటి ఆ ట్వీట్‌లో 'ఎన్నికలు సమీపిస్తున్న తమిళనాట 50 మంది యువత బలయ్యే తొక్కిసలాట ఒక్కటైనా చూస్తాం. డీఎంకే కంటే 10 రెట్లు విషపూరిత, క్రూర, మతిలేని విజయ్‌ వల్లే ఇది జరుగుతుంది' అని అన్నారు. అతడు ఈ ట్వీట్‌ సాధారణంగా చేశారా? లేక పరిణామాలు, పరిస్థితులు గమనించే చెప్పారా? అనేది తెలియాల్సి ఉంది.

తమిళనాడులోని కరూర్‌లో నటుడు-రాజకీయ నాయకుడు విజయ్ ప్రచార ర్యాలీలో తమ ప్రాణాలను కాపాడుకోవడానికి తీవ్రంగా ప్రయత్నించి, గుడిసెలను పగులగొట్టి తప్పించుకోవడానికి ప్రయత్నిస్తున్న పిల్లలకు సంబంధించిన వీడియోలు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి. తమిళగ వెట్రీ కజగం (టీవీకే) చీఫ్ ర్యాలీలో 10 మంది పిల్లలతో సహా 39 మంది మరణించారు. తమ అభిమాన నటుడిని చూసేందుకు గంటల తరబడి ఎండలో వేచి ఉండగా, వేడి, డీహైడ్రేషన్‌, స్థలం లేకపోవడం వల్ల చాలా మంది స్పృహ కోల్పోయారు.

చాలా మంది స్పృహా కొల్పోయి విజయ్ ప్రచార వాహనం పక్కనే కూలిపోయారు, దీంతో ఆయన తన ప్రసంగాన్ని మధ్యలో ఆపేశారు. సోషల్ మీడియాలో సూచించిన సమయం కంటే ఏడు గంటల తర్వాత, సాయంత్రం 7:40 గంటలకు విజయ్ రావడంతో జనం అసౌకర్యం మరింత పెరిగింది. జనం రద్దీగా ఉండటంతో, ఎండలో నిలబడటానికి ప్రజలు ఇబ్బంది పడుతుండడంతో చాలా మంది గంటల తరబడి స్పృహ కోల్పోయారని సమాచారం.

Next Story