సామాన్యులకు షాకింగ్ న్యూస్.. ఇప్పటికే నిత్యావసరాలకు పెరిగిన ధరలతో ఇబ్బందులు పడుతున్న సామాన్యుల నెత్తి మీద మరో పిడుగు పడింది. దేశ వ్యాప్తంగా కోడిగుడ్ల ధరలు పెరిగాయి. హోల్‌సేల్ మార్కెట్‌లో ధర రూ.5.90గా నేషనల్ ఎగ్ కో ఆర్డినేషన్ కమిటీ (ఎన్‌ఈసీసీ) నిర్ణయించింది. దీంతో రిటైల్ మార్కెట్‌లో రూ.6.50 నుంచి రూ.7 వరకు అమ్మే అవకాశం ఉంది. చలికాలంలో గుడ్డు వినియోగం పెరిగింది.
అటు క్రిస్మస్ పండుగ, న్యూఇయర్ కోసం కేకుల తయారీలో వాడనుండటంతో రేట్లు పెరిగినట్టు తెలుస్తోంది. మున్ముందు కోడిగుడ్డు ధర మరింత పెరగవచ్చని బిజినెస్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. కోడిగుడ్డులో చాలా పోషకాలుంటాయి. కోడిగుడ్డు తినడం వల్ల ఆరోగ్యానికి ఎన్నో లాభాలు ఉన్నాయి. చాలామంది కోడిగుడ్లు తినేందుకు ఎంతో ప్రాధాన్యం ఇస్తుంటారు. అయితే ఇప్పడు కోడి గుడ్డు ధరలు భారీగా పెరగడంతో సామాన్యులకు కొనాలంటేనే ఆలోచిస్తున్నారు.