సిస్టర్ లైబ్రరీ.. ఇక్కడ దొరికే పుస్తకాలన్నీ వాటికి సంబంధించినవే.!

A Library Which Focuses On Works Written By Women. దేశ వాణిజ్య రాజధాని ముంబైలోని ధారావి.. మురికివాడలకు కేరాఫ్ అడ్రస్. ఇప్పుడు మనం చెప్పుకోబోయే సిస్టర్ లైబ్రరీ అక్కడే పుట్టింది.

By అంజి  Published on  3 Aug 2022 4:59 AM GMT
సిస్టర్ లైబ్రరీ.. ఇక్కడ దొరికే పుస్తకాలన్నీ వాటికి సంబంధించినవే.!

దేశ వాణిజ్య రాజధాని ముంబైలోని ధారావి.. మురికివాడలకు కేరాఫ్ అడ్రస్. ఇప్పుడు మనం చెప్పుకోబోయే సిస్టర్ లైబ్రరీ అక్కడే పుట్టింది. ప్రత్యేకంగా మహిళల కోసమే ఈ లైబ్రరీని ఏర్పాటు చేశారు. 2018లో ఆర్టిస్ట్ అక్వీ థామీ ఈ లైబ్రరీని ప్రారంభించారు. దేశంలో మొట్టమొదటి స్త్రీవాద గ్రంథాలయం ఇది. ఈ లైబ్రరీలో ఉన్న ప్రతి పుస్తకం మహిళలు రాసినవే. అన్ని పుస్తకాలు ఆలోచన రేకెత్తించే విధంగానే ఉంటాయి. మహిళా రచయితల సాహిత్యానికే ఈ లైబ్రరీలో స్థానం. అక్వీ థామీ.. ఈ లైబ్రరీని కమ్యానిటీ హాలుగా తీర్చిదిద్ది.. స్థానికులతో అక్షరాభ్యాసం కూడా చేయిస్తున్నారు.

ఎనిమిదేళ్ల క్రితం థామీ స్త్రీవాద రచనలు అనే అంశంపై పరిశోధన చేయడంతో లైబ్రరీ ఆలోచన ప్రారంభమైంది. ఐదేళ్ల క్రితం 100 పుస్తకాలతో ప్రారంభమైనా సిస్టర్‌ లైబ్రరీలో.. ఇప్పుడు పుస్తకాల వెయ్యికిపైగా చేరింది. నేపాల్‌, బంగ్లాదేశ్‌, న్యూజిలాండ్‌, అమెరికా దేశాల సాహిత్యానికీ ఇందులో చోటిచ్చారు. ఇదే ఉత్సాహంతో థామీ 'రేడియో సిస్టర్‌' కార్యక్రమాన్ని ప్రారంభించారు. 'సిస్టర్‌ ప్రెస్‌' ద్వారా ఇక్కడ ప్రింటింగ్‌లో మహిళలకు శిక్షణ ఇస్తున్నారు. 'సిస్టర్‌ టైమ్స్‌' నెలవారి పత్రికను స్థానిక మహిళలే ముద్రిస్తారు. ధారవికి చెందిన పిల్లలు ఈ లైబ్రరీని చూసుకుంటారు.

హిందీ, ఉర్దూ, తమిళం, తెలుగు, ఖాసీ, అస్సామీ, నేపాలీ, మరాఠీ, బెంగాలీ, ఇతర భాషలలో పుస్తకాలు అందుబాటులో ఉన్నాయి. వివిధ స్వదేశీ భాషల్లోని దేశీయ మహిళల మరిన్ని రచనలను సేకరించడం కోసం థామీ వెతుకుతోంది. కోల్‌కతా నివాసి విధి తోడి మాట్లాడుతూ ''ఈ గ్రంథాలయం ద్వారా సావిత్రి బాయి ఫూలే, ఫాతిమా షేక్, నంగేలి మరియు సమకాలీన దళిత రచయిత్రి ఊర్మిళా పవార్ వంటి మహిళా సంస్కర్తలు మరియు రచయితల రచనలు తనకు పరిచయమయ్యాయని చెప్పారు. అంతకుముందు కోవిడ్-19 మహమ్మారి కారణంగా, సిస్టర్ లైబ్రరీని మూసివేయవలసి వచ్చింది. కానీ ఇప్పుడు తిరిగి ట్రాక్‌లోకి వచ్చింది.

Next Story