విషాదం: బోరుబావిలో నాలుగేళ్ల బాలుడు

A four year old boy falls into an open borewell... ఉత్తరప్రదేశ్‌లో విషాదం చోటు చేసుకుంది. మహూబా జిల్లాలోని ఓ గ్రామంలో

By సుభాష్  Published on  3 Dec 2020 5:39 AM GMT
విషాదం: బోరుబావిలో నాలుగేళ్ల బాలుడు

ఉత్తరప్రదేశ్‌లో విషాదం చోటు చేసుకుంది. మహూబా జిల్లాలోని ఓ గ్రామంలో ప్రమాదవశాత్తు నాలుగేళ్ల బాలుడు బావిలో పడిపోయాడు. సమాచారం అందుకున్న ఎన్డీఆర్‌ఎఫ్‌, ఎస్‌డీఆర్‌ఎఫ్‌ బృందాలు ఘటన స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. బావిలోకి ఆక్సిజన్‌ను అందిస్తూ బాలుడిని రక్షించేందుకు ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నారు.

బుధవారం మధ్యాహ్‌నం సమయంలో ధనేంద్ర అనే నాలుగేళ్ల బాలుడు బోర్‌బావిలో పడిపోయాడని పోలీసు ఉన్నతాధికారులు తెలిపారు. ఘటన జరిగిన సమయంలో బాలుడి తల్లిదండ్రులు పొలానికి నీరు పెట్టేందుకు వెళ్లారని తెలిపారు. బాలుడిని కాపాడేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేసేందుకు లక్నో నుంచి జాతీయ, రాష్ట్ర విపత్తు బృందాలను రంగంలోకి దింపామని మహూబా జిల్లా మేజిస్ట్రేట్‌ సత్యేంద్ర కుమార్‌ తెలిపారు.

Next Story
Share it