Bihar : ఆలయంలో తొక్కిసలాట.. 8 మంది మహిళలు మృతి

బీహార్‌లోని నలంద జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. మంగళవారం శీతల్‌ ఆలయంలో జరిగిన మతపరమైన వేడుకలో తొక్కిసలాట..

By -  అంజి
Published on : 31 March 2026 11:25 AM IST

Bihar Nalanda Temple Stampede, Sheetla Temple Accident 2026, Devotees Killed in Bihar

బీహార్‌లో ఆలయంలో తొక్కిసలాట.. 8 మంది మహిళలు మృతి 

బీహార్‌లోని నలంద జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. మంగళవారం శీతల్‌ ఆలయంలో జరిగిన మతపరమైన వేడుకలో తొక్కిసలాట జరిగి ఎనిమిది మంది మహిళలు మృతి చెందారు. పూజల కోసం పెద్ద సంఖ్యలో భక్తులు తరలిరావడంతో ఆలయ ప్రాంగణం కిక్కిరిసిపోయిందని, ఈ క్రమంలో ఒక్కసారిగా తొక్కిసలాట జరగడంతో పలువురు మహిళలు కిందపడిపోయి ఊపిరాడక ప్రాణాలు కోల్పోయారని సమాచారం.

ఈ ఘటనలో మరికొంతమంది భక్తులు తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న వెంటనే స్థానిక యంత్రాంగం మరియు పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. గాయపడిన వారిని చికిత్స నిమిత్తం సమీపంలోని ఆసుపత్రులకు తరలించారు. ప్రస్తుతం ఆలయ పరిసరాల్లో పరిస్థితిని అధికారులు పర్యవేక్షిస్తున్నారు. ఇది డెవలప్‌డ్‌ స్టోరీ..

Next Story