చికిత్స పేరుతో యువతి తలలో 70 సూదులు దించిన మాంత్రికుడు
ఓ యువతి అనారోగ్యం పేరుతో ఓ మాంత్రికుడి వద్దకు వెళ్తే అతను ఏకంగా ఆమె తలలో 70 సూదులను దించాడు
By Srikanth Gundamalla Published on 21 July 2024 7:45 AM ISTచికిత్స పేరుతో యువతి తలలో 70 సూదులు దించిన మాంత్రికుడు
దేశంలో ఇంకా మూఢనమ్మకాలు ఉన్నాయి. వైద్య పరంగా ఎంత అభివృద్ధి జరిగినా.. కొత్త చికిత్సలు అందుబాటులోకి వచ్చినా కొందరు మాంత్రికులను నమ్ముతున్నారు. తాజాగా ఓ యువతి అనారోగ్యం పేరుతో ఓ మాంత్రికుడి వద్దకు వెళ్తే అతను ఏకంగా ఆమె తలలో 70 సూదులను దించాడు. ఈ సంఘటన ఒడిశాలో చోటుచేసుకుంది. కలకలం రేపుతోంది.
ఒడిశాలో బలంగీర్ జిల్లాలో ఈ దారుణ ఘటన జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. స్థానిక సింథికేలా పోలీస్ స్టేషన్ పరిధిలోని ఇచ్‌గావ్ గ్రామానికి చెందిన రేష్మా బెహారా (19) మూడేళ్ల క్రితం అనారోగ్యం పాలైంది. దాంతో.. ఆమెను తండ్రి బిష్ణు బెహారా.. తేజ్‌రాజ్ రాణా అనే మాంత్రికుడి వద్దకు తీసుకెళ్లారు. వైద్య పేరిట తేజ్‌రాజ్ పలు మార్లు రేష్మా తలలోకి 70 సూదులను గుచ్చాడు. అయితే.. ఇటీవల యువతి తీవ్ర తలనొప్పితో బాధపడింది. యువతి కుటుబ సభ్యులు ఆమెను వింసార్ ఆస్పత్రికి తీసుకెల్లారు. శుక్రవారం వైద్యులు ఆమెకు స్కానింగ్ చేశారు. వచ్చిన రిపోర్టులను చూసి వైద్యులే ఆశ్చర్యపోయారు. ఆమె పుర్రెపై ఏకంగా పదుల సంఖ్యలో సూదులు ఉన్నట్లు గుర్తించారు.
ఆ తర్వాత ఇదే విషయాన్ని వైద్యులు యువతి కుటుంబ సభ్యులకు చెప్పారు. ఆమెకు శస్త్రచికిత్స అవసరమని అన్నారు. దాదాపు గంటన్నరపాటు శ్రమించి యువతి తలలో ఉన్న 70 సూదులను బయటకు తీశారు వైద్యులు, పుర్రె ఎముకపై ఉన్న సూసులు లోనికి వెళ్లలేదనీ.. దాంతో ఆమెకు ప్రాణాపాయం తప్పిందని వైద్యులు వెల్లడించారు. యువతి కుటంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు మాంత్రికుడు తేజ్‌రాజ్‌ను అరెస్ట్ చేశారు.