పాకిస్థాన్ లో ఉగ్రవాదులకు శిక్షణ ఇస్తున్న ఎన్నో క్యాంపులు ఉన్నాయి. ఇప్పటికే భారత వైమానిక దళం ఆపరేషన్ సింధూర్ సమయంలో ధ్వంసం చేసింది. వందలాది మంది ఉగ్రవాదులు ఈ దాడుల్లో హతమయ్యారు. ఇంకా అక్కడ ఉగ్రస్థావరాలు మిగిలే ఉన్నాయని, ఉగ్ర కార్యకలాపాలు జరుగుతున్నాయని సరిహద్దు భద్రతా దళం (బీఎస్ఎఫ్) ఐజీ అశోక్ యాదవ్ వెల్లడించారు.
నియంత్రణ రేఖకు ఆవలివైపు ప్రస్తుతం 69 ఉగ్రస్థావరాలు యాక్టివ్ గా ఉన్నాయని, ఈ క్యాంపుల్లో సుమారు 100 నుంచి 120 మంది ఉగ్రవాదులు భారత్ లోకి చొరబడేందుకు సిద్ధంగా ఉన్నారన్నారు. భారత్ లోకి చొరబడేందుకు అవకాశం కోసం చూస్తున్నారని, ఈ ఉగ్రవాదుల కదలికలను నిరంతరం గమనిస్తున్నామని తెలిపారు. ఇక ఇటీవల చొరబాటుకు నాలుగుసార్లు ప్రయత్నించిన ఎనిమిది మంది ఉగ్రవాదులను బీఎస్ఎఫ్ మట్టుబెట్టిందన్నారు.