ఛత్తీస్ గఢ్ లో భారీ ఎన్ కౌంటర్
encounter in Chhattisgarh's Sukma. బీజపూర్ జిల్లా తర్రెమ్ అటవీప్రాంతంలోని జొన్నగూడ దగ్గర పోలీసులకు, మావోయిస్టులకు ఎదురు కాల్పులు జరిగాయి.
By Medi Samrat Published on 4 April 2021 8:50 AM ISTఅడవులు మళ్లీ తుపాకుల మోత తో దద్దరిల్లుతున్నాయి. గత కొన్ని రోజులుగా మావోయిస్టు దళాల సంచారంతో సరిహద్దు ప్రాంతాలు వణికిపోతున్నాయి. ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియకుండా ఉంది.. తాజాగా జరుగుతున్న ఎన్‌కౌంటర్లతో మళ్లీ రక్తపాతం మొదలైంది. దీంతో సామాన్య ప్రజలు భయం గుప్పిట్లో బతుకు వెళ్లదీస్తున్నారు. మావోయిస్టులను ఏరేసేందుకు కేంద్రం పెద్ద ఎత్తున బలగాలను రంగంలోకి దించింది. అడవుల్లో కూంబింగ్ చేస్తోంది. మరోవైపు వారిని అడ్డుకునేందుకు నక్సల్స్ పావులు కదుపుతున్నారు. ఫలితంగా ఎన్ కౌంటర్లు అనివార్యమవుతున్నాయి. ఇరువైపులా నష్టం జరుగుతోంది. తాజాగా తర్రెమ్ ఎన్ కౌంటర్ లో ఇదే జరిగింది. బీజపూర్ జిల్లా తర్రెమ్ అటవీప్రాంతంలోని జొన్నగూడ దగ్గర పోలీసులకు, మావోయిస్టులకు ఎదురు కాల్పులు జరిగాయి.
బీజాపూర్ జిల్లాలోని తార్రెమ్ అటవీ ప్రాంతంలో మావోయిస్టుల కదలికలు ఉన్నట్లు నిఘా వర్గాల ద్వారా అధికారులకు సమాచారం అందించింది. ఇదే క్రమంలోనే జిల్లాలోని అటవీ ప్రాంతాలను డీఆర్జీ, ఎస్టీఎఫ్, సీఆర్పీఎఫ్, కోబ్రా ప్రత్యేక బలగాలు జల్లెడపడుతున్నా యి.
శనివారం కూంబింగ్ నిర్వహిస్తుండగా మధ్యాహ్నం 1 గంట సమయంలో భద్రతా సిబ్బందికి మావోయిస్టులు తారసపడ్డారు. తప్పించుకునే క్రమంలో మావోయిస్టులు భద్రతా సిబ్బందిపై కాల్పులకు పాల్పడ్డారు. వెంటనే జవాన్లు కూడా కాల్పులు ప్రారంభించారు. ఈ ఎన్‌కౌంటర్‌లో ఐదుగురు భద్రతా సిబ్బందితో పాటు ఇద్దరు మావోయిస్టులు మరణించారు. ప్రస్తుతం తార్రెమ్ అటవీ ప్రాంతం మొత్తం భద్రతా దళాలు మోహరించాయి. తప్పించుకున్న మావోయిస్టుల కోసం ప్రత్యేక బృందాలతో గాలింపు చర్యలు చేపట్టారు.
తెర్రం అటవీ ప్రాంతంలో కూంబింగ్ జరిపిన జవాన్లకు భారీగా మావోయిస్టులు తారసపడ్డారు. ఇరువర్గాల మధ్య భీకరంగా కాల్పులు మొదలయ్యాయి. ఈ ఘటనలో కోబ్రా దళానికి చెంది న ఒక జవాను, బస్తరీయ్(ఎస్టీఎఫ్) విభాగానికి చెం దిన ఇద్దరు, డీఆర్జీకి చెందిన మరో ఇద్దరు జవాన్లు మృతిచెందారు. 28 మంది గాయపడ్డారు. మారుమూల ప్రాంతం కావడంతో వారిని ఆస్పత్రికి తరలించడంలో ఇబ్బందులు ఎదురయ్యాయి.
భారత వాయు సేనకు చెందిన హెలికాప్టర్ల ద్వారా ఏడుగురు క్షతగాత్రులను రాయ్‌పూర్ ప్రభుత్వాస్పత్రికి, మరో 21 మం దిని బీజాపూర్ దవాఖానాకు తరలించారు. నక్సల్స్ వైపు 9 మంది మృతిచెంది ఉంటారని ఐజీ వెల్లడించారు. ఆ సంఖ్య మరింత పెరిగే అవకాశముందన్నా రు. ఒక మహిళా నక్సల్ మృతదేహం లభ్యమైందని తెలిపారు. జవాన్ల మృతిపట్ల ఛత్తీ్‌సగఢ్ సీఎం భూపేశ్ బగేల్, ప్రధాని మోదీ సంతాపం తెలిపారు.