యుద్ధ నౌక ఐఎన్‌ఎస్ రణవిజయ్‌లో అగ్నిప్రమాదం

4 sailors injured as fire breaks out onboard INS Ranvijay.భారత నౌకాదళానికి చెందిన యుద్ధ నౌక ఐఎన్‌ఎస్ రణవిజయ్‌లో

By తోట‌ వంశీ కుమార్‌  Published on  24 Oct 2021 10:43 AM IST
యుద్ధ నౌక ఐఎన్‌ఎస్ రణవిజయ్‌లో అగ్నిప్రమాదం

భారత నౌకాదళానికి చెందిన యుద్ధ నౌక ఐఎన్‌ఎస్ రణవిజయ్‌లో శ‌నివారం సాయంత్రం అగ్నిప్ర‌మాదం సంభ‌వించింది. మంట‌ల‌ను అదుపు చేసే క్ర‌మంలో నలుగురు నావికులు గాయపడ్డారు. వెంట‌నే వారిని చికిత్స నిమిత్తం ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రం విశాఖ‌ప‌ట్నంలోని నేవి ఆస్ప‌త్రి ఎన్‌హెచ్‌ఎస్‌ కళ్యాణికి త‌ర‌లించి చికిత్స అందించారు. శ‌నివారం సాయంత్రం 5.30 గంట‌ల స‌మయంలో ఈ ప్ర‌మాదం జ‌రిగిన‌ట్లు నేవీ అధికారులు ఓ ప్ర‌క‌ట‌న‌లో తెలిపారు. మంట‌లు అదుపుచేసిన‌ట్లు వెల్ల‌డించారు. కాగా.. అగ్ని ప్ర‌మాదానికి గ‌ల కార‌ణాల‌పై ద‌ర్యాప్తు ప్రారంభించ‌న‌ట్లు వెల్ల‌డించారు.

Next Story