పట్టాలపై కూర్చున్న ముగ్గురు చిన్నారులు.. ఒక్కసారిగా రైలు దూసుకురావడంతో..

3 children crushed to death by train in Punjab. పంజాబ్‌లో ఘోర ప్రమాదం జరిగింది. కిరాత్‌పూర్ సాహిబ్‌లో ఆదివారం రైలు పట్టాలపై కూర్చొని

By అంజి  Published on  28 Nov 2022 10:08 AM IST
పట్టాలపై కూర్చున్న ముగ్గురు చిన్నారులు.. ఒక్కసారిగా రైలు దూసుకురావడంతో..

పంజాబ్‌లో ఘోర ప్రమాదం జరిగింది. కిరాత్‌పూర్ సాహిబ్‌లో ఆదివారం రైలు పట్టాలపై కూర్చొని పండ్లు తింటున్న ముగ్గురు చిన్నారులపైనుంచి రైలు దూసుకెళ్లింది. దీంతో ముగ్గురు పిల్లలు మరణించారు. ఒకరు గాయపడ్డారు. అసిస్టెంట్ సబ్-ఇన్‌స్పెక్టర్ జగ్జిత్ సింగ్ మాట్లాడుతూ.. పిల్లలు కొన్ని చెట్ల నుండి పండ్లు తీసుకుని ట్రాక్‌లపై కూర్చొని తింటున్నారని, రైలు వారి వద్దకు వస్తున్నట్లు వారు గుర్తించలేదని, ఇంతలోనే ఈ ప్రమాదం జరిగిందని చెప్పారు.

ఇద్దరు చిన్నారులు అక్కడికక్కడే మృతి చెందగా, మరొకరు ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందారని తెలిపారు. నాలుగో వ్యక్తి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. సట్లెజ్ నదిపై ఉన్న లోహంద్ రైల్వే వంతెనపై ఈ ప్రమాదం జరిగింది. సహరాన్‌పూర్‌ నుంచి హిమాచల్‌ప్రదేశ్‌ వెళ్తున్న రైలు కిరాత్‌పూర్‌ సాహిబ్‌ సమీపంలోకి రాగానే పిల్లలు పట్టాలపై ఉన్నారు. ప్రమాదం తర్వాత రైలు నిలిచిపోయింది. గాయపడిన పిల్లలను ఆనంద్‌పూర్ సాహిబ్‌లోని సివిల్ ఆసుపత్రికి తీసుకువెళ్లారు. అయితే మార్గమధ్యంలో ఒకరు మరణించారు.

ఈ సంఘటన తర్వాత పంజాబ్ మాజీ ముఖ్యమంత్రి కెప్టెన్ అమరీందర్ సింగ్ తన సంతాపాన్ని పంచుకోవడానికి ట్విట్టర్‌లోకి వెళ్లారు. మృతుల కుటుంబాలకు "తగిన నష్టపరిహారం" అందించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు.



Next Story