కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ రాజీనామా చేయాలని లేదంటే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ), ఐసీఐసీఐ బ్యాంక్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌లను పేల్చేస్తామంటూ.. బెదిరింపు ఈమెయిల్‌లు పంపిన కేసులో ముంబై క్రైమ్ బ్రాంచ్ ముగ్గురు వ్యక్తులను అదుపులోకి తీసుకుంది. గుజరాత్‌లోని వడోదరలో ముగ్గురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. ఒకరిని ఆదిల్ రఫీఖ్ గా గుర్తించారు, మరొకరు అతని బంధువు, ఇంకొకరు అతని స్నేహితుడుగా అధికారులు గుర్తించారు. బెదిరింపు ఈమెయిల్‌ల వెనుక ఉన్న ఉద్దేశాన్ని తెలుసుకోవడానికి అదుపులోకి తీసుకున్న వ్యక్తులను ప్రశ్నించారు అధికారులు. సీతారామన్ రాజీనామా చేయకపోతే ఆర్‌బిఐ, ఐసీఐసీఐ బ్యాంక్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ కార్యాలయాలపై దాడులు జరుగుతాయని ఈమెయిల్స్ పంపడానికి ఉపయోగించిన పరికరాన్ని నిర్ధారించడానికి పోలీసులు ప్రయత్నిస్తున్నారు.
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ తమ పదవులకు రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ముంబయిలో ఆర్బీఐ కార్యాలయంలోనూ, హెచ్ డీఎఫ్ సీ, ఐసీఐసీఐ సహా 11 చోట్ల బాంబులు పిలుస్తామని ఆ ఈ-మెయిల్ లో పేర్కొన్నారు. ఈ-మెయిల్ లో పేర్కొన్న అన్ని ప్రదేశాల్లో నిశితంగా తనిఖీలు చేశారు అధికారులు. ఎలాంటి పేలుడు పదార్థాలు కనిపించలేదని నిర్ధారించారు. దీనిపై కేసు నమోదు చేసుకున్నామని.. దర్యాప్తు కొనసాగుతుందని పోలీసులు తెలిపారు. 'ఖిలాఫత్ ఇండియా' అనే పేరు మీద బెదరింపు ఈ-మెయిల్ వచ్చినట్టు గుర్తించారు.