ఉత్తరప్రదేశ్‌లోని బల్లియా జిల్లాలో చికెన్‌పాక్స్ వ్యాప్తి చెందింది. అక్కడ గోవింద్‌పూర్ ప్రాథమిక పాఠశాలలో సుమారు 20 మంది పిల్లలు, ఒక ఉపాధ్యాయుడికి చికెన్‌పాక్స్ సోకినట్లు గుర్తించారు. జిల్లా ఆరోగ్య శాఖ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. ఫిబ్రవరి 2న కొంతమంది చిన్నారుల ముఖాలపై తొలిసారిగా ఎర్రటి మచ్చలు కనిపించాయని.. అది మొదట దోమ కాటుగా భావించామని తెలిపారు. కానీ సంఖ్య పెరుగుతూనే ఉందన్నారు. ఆ తర్వాత వారికి చికెన్ గున్యా లక్షణాలు కనిపించాయని తెలిపారు.
20 మంది చిన్నారుల్లో లక్షణాలు కనిపించినప్పుడు వారిని ఇంటికి పంపించామని నరహీ కమ్యూనిటీ హెల్త్ సెంటర్ సూపరింటెండెంట్ డాక్టర్ సాకేత్ బిహారీ శర్మ తెలిపారు. ''ఆరోగ్య శాఖ చర్యకు దిగింది. పాఠశాలకు బృందాన్ని పంపింది. వారికి అవసరమైన మందులను కూడా అందుబాటులో ఉంచడం జరిగింది'' అని ఆయన తెలిపారు. అసిస్టెంట్ టీచర్ వివేక్ కుమార్‌కు కూడా వ్యాధి సోకిందని, ఈ విషయాన్ని బ్లాక్ ఎడ్యుకేషన్ ఆఫీసర్‌కు రిపోర్ట్ చేశామని స్కూల్ హెడ్‌మాస్టర్ (ఇన్‌చార్జ్) తాన్య శ్రీవాస్తవ తెలిపారు.