జ‌మ్ము క‌శ్మీర్‌లో ఎదురుకాల్పులు.. ఇద్ద‌రు ఉగ్ర‌వాదుల హ‌తం

2 Terrorists killed in encounter in Shopian.జ‌మ్ము కాశ్మీర్‌లోని షోపియాన్ జిల్లాలో శుక్రవారం భద్రతా బలగాలు

By తోట‌ వంశీ కుమార్‌  Published on  25 Feb 2022 12:49 PM IST
జ‌మ్ము క‌శ్మీర్‌లో ఎదురుకాల్పులు.. ఇద్ద‌రు ఉగ్ర‌వాదుల హ‌తం

జ‌మ్ము కాశ్మీర్‌లోని షోపియాన్ జిల్లాలో శుక్రవారం భద్రతా బలగాలు, ఉగ్ర‌వాదుల‌కు మ‌ధ్య ఎదురుకాల్పులు చోటుచేసుకున్నాయి. ఈ ఎన్‌కౌంట‌ర్‌లో ఇద్ద‌రు ఉగ్ర‌వాదులు హ‌త‌మ‌య్యారు. షోపియాన్‌ జిల్లా అమ్శీపొరాలో ఉగ్ర‌వాదులు ఉన్నార‌నే స‌మాచారంతో పోలీసులు మ‌రియు భ‌ద్ర‌తాబ‌ల‌గాలు అక్క‌డ గాలింపు చేప‌ట్టారు. గాలింపు చర్య‌లు చేప‌ట్టిన భ‌ద్ర‌తా బ‌ల‌గాల‌పై ఉగ్ర‌వాదులు ఒక్క‌సారిగా కాల్పులు జ‌రిపారు.

వెంట‌నే అప్ర‌మ‌త్త‌మైన భ‌ద్ర‌తాబ‌ల‌గాలు కూడా ఎదురుకాల్పులు జ‌రిపాయి. ఈ ఘ‌ట‌న‌లో ఇద్ద‌రు గుర్తు తెలియ‌ని ముష్క‌రులు హ‌త‌మైన‌ట్లు క‌శ్మీర్ జోన్ పోలీసులు తెలిపారు. వారి వ‌ద్ద ఆయుధాలు, పేలుడు ప‌దార్థాల‌ను స్వాధీనం చేస్తుకున్న‌ట్లు చెప్పారు. ఇంకా ఆ ప్రాంతంలో సెర్చ్ ఆప‌రేష‌న్ కొన‌సాగుతున్న‌ట్లు పోలీసులు తెలిపారు. హ‌త‌మైన ఉగ్ర‌వాదులు ఏ సంస్థ‌కు చెందిన వారో గుర్తించే ప‌నిలో పోలీసులు ఉన్నారు.

Next Story