జమ్మూ కాశ్మీర్‌లోని పుల్వామా జిల్లాలో శనివారం భద్రతా దళాలు, ఉగ్రవాదులకు మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఈ ఎదురుకాల్పుల్లో ఇద్దరు ఉగ్రవాదులు హతమైయ్యారు. నాగ్‌బెరన్ – తార్సర్ అటవీ ప్రాంతంలో ఉగ్రవాదులు ఉన్న సమాచారంతో ఈ రోజు ఉదయం అక్కడ భద్రతా దళాలు కార్డన్ మరియు సెర్చ్ ఆపరేషన్ చేపట్టారు. సైనికులు సెర్చ్ చేస్తుండగా.. ఉగ్రవాదులు కాల్పులకు జరపడంతో సెర్చ్ ఆపరేషన్ కాస్త ఎన్‌కౌంటర్‌గా మారిందని పోలీసు అధికారి ఒకరు తెలిపారు.
ఎదురుకాల్పుల్లో ఇద్దరు ఉగ్రవాదులు హతమైనట్లు ఆ అధికారి తెలిపారు. అయితే.. వారు ఏ సంస్థకు చెందిన వారో ఇంకా తెలియరాలేదని.. వారిని గుర్తించేందుకు యత్నిస్తున్నట్లు కాశ్మీర్ జోన్ పోలీసులు తెలిపారు.