నీట్‌ పరీక్షలో సంచలనం.. వారి గ్రేస్‌ మార్కుల తొలగింపు

దేశంలో ఇటీవల విడుదలైన నీట్‌ పరీక్షల ఫలితాల ఎపిసోడ్‌ సంచలనంగా మారిన విషయం తెలిసిందే.

By Srikanth Gundamalla  Published on  13 Jun 2024 9:06 AM GMT
students, neet results, grace marks,  re-exam,

నీట్‌ పరీక్షలో సంచలనం.. వారి గ్రేస్‌ మార్కుల తొలగింపు

దేశంలో ఇటీవల విడుదలైన నీట్‌ పరీక్షల ఫలితాల ఎపిసోడ్‌ సంచలనంగా మారిన విషయం తెలిసిందే. ఈ పరీక్షల్లో అక్రమాలు చోటుచేసుకున్నాయని ఆరోపణలు వచ్చాయి. ఎంబీబీఎస్, బీడీఎస్‌తో పాటు ఇతర వైద్య కోర్సుల్లో ప్రవేశం కోసం నీట్‌ యూజీ పరీక్ష నిర్వహించారు. ఈ ఫలితాల్లో 1500 మందికి పైగా విద్యార్థులకు ఇచ్చిన గ్రేస్‌ మార్కులను తొలగిస్తామని సుప్రీంకోర్టుకు కేంద్రం తెలిపింది. ఇక వారు మరోసారి పరీక్ష రాసేందుకు అవకాశం కూడా కల్పిస్తామని పేర్కొంది. నీట్‌ పరీక్షలో అవకతవకలు జరిగాయన్న ఆరోపణలతో కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది. కాగా.. అభ్యర్థులకు మరోసారి పరీక్ష నిర్వహిస్తామని చెప్పింది. ఒక వేళ అభ్యర్థుల్లో ఎవరైనా పరీక్ష రాసేందుకు ఆసక్తిగా లేకపోతే.. తీసేసిన గ్రేస్‌ మార్కులతోనే ప్రకటిస్తామని సుప్రీంకోర్టుకు కేంద్రం తెలిపింది. నీట్‌, యూజీ పరీక్షను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లపై విచారణ జరిపిన సుప్రీంకోర్టు .. కౌన్సెలింగ్‌ను మాత్రం ఆపేది లేదని తెలిపింది.

కాగా.. ఈ ఏడాది నీట్‌ పరీక్షలో 1563 మంది విద్యార్థులకు అదనంగా గ్రేస్‌ మార్కులు ఇచ్చారు. NCERT పాఠ్యపుస్తకాల్లో మార్పులు, పరీక్షా కేంద్రాల వద్ద సమయం కోల్పోవడంతో వారికి ఈ గ్రేస్‌ మార్కులను కలిపి ఇచ్చారు. దీనిపై అభ్యంతరాలు వ్యక్తం అయ్యాయి. అంతేకాదు.. నీట్‌ పరీక్ష నిర్వహణపై పలు ఆరోపణలు వచ్చాయి. ఈ క్రమంలోనే కేంద్ర విద్యాశాఖ నలుగురు సభ్యులతో కమిటీ వేసి.. అదనంగా గ్రేస్‌ మార్కులు పొందిన వారిపై విచారణ జరిపించింది. ఆ కమిటీ నివేదిక కూడా సమర్పించింది. ఆ వివరాలనే కేంద్రం సుప్రీంకోర్టుకు వివరించింది. అదనంగా గ్రేస్‌ మార్కులు పొందిన 1563 మంది విద్యార్థుల స్కోర్ కార్డులను రద్దు చేయాలని కమిటీ నిర్ణయించిందని కోర్టుకు తెలిపింది కేంద్రం. ఈ నేపథ్యంలో వారికి మళ్లీ పరీక్ష రాసే అవకాశం కల్పిస్తున్నట్లు వివరించింది. జూన్ 23న వారికి మరోసారి పరీక్ష నిర్వహించి.. 30వ తేదీలోగా ఫలితాలు ప్రకటిస్తామని కేంద్రం సుప్రీంకోర్టుకు తెలిపింది. ఆ తర్వాతే కౌన్సిలింగ్ ఉంటుందని వివరించింది. మళ్లీ పరీక్ష వద్దనుకునే విద్యార్థులు గ్రేస్‌ మార్కులు లేకుండా ఒరిజినల్ మార్కులతో కౌన్సిలింగ్‌కు వెళ్లొచ్చని కేంద్రం పేర్కొంది.

Next Story