బీజేపీ నేత హత్య కేసు.. 15 మందికి ఉరి శిక్ష విధించిన కోర్టు

2021లో జరిగిన బీజేపీ నేత రంజిత్ శ్రీనివాసన్ హత్యకేసులో ప్రమేయం ఉన్న 15 మంది నిందితులకు మావెలిక్కర అదనపు జిల్లా సెషన్ కోర్టు-I మంగళవారం మరణశిక్ష విధించింది.

By అంజి  Published on  30 Jan 2024 6:50 AM GMT
PFI, Kerala, BJP leader, murder, Ranjith Sreenivasan

బీజేపీ నేత హత్య కేసు.. 15 మందికి ఉరి శిక్ష విధించిన కోర్టు

2021లో జరిగిన బీజేపీ నేత రంజిత్ శ్రీనివాసన్ హత్యకేసులో ప్రమేయం ఉన్న 15 మంది నిందితులకు మావెలిక్కర అదనపు జిల్లా సెషన్ కోర్టు-I మంగళవారం మరణశిక్ష విధించింది. శిక్ష పరిమాణాన్ని కోర్టు తర్వాత ప్రకటించనుంది. ఇటీవలి కేరళ చరిత్రలో ఇంతమంది దోషులకు ఏ కోర్టు కూడా ఉరిశిక్ష విధించలేదు. శిక్ష విధించబడిన మొత్తం 15 మంది నిందితులు నిషేధించబడిన ఇస్లామిస్ట్ సంస్థ పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా (PFI)తో సంబంధం కలిగి ఉన్నారు. భారతీయ జనతా పార్టీ ఓబీసీ మోర్చా రాష్ట్ర కార్యదర్శి రంజిత్ శ్రీనివాసన్, డిసెంబర్ 19, 2021న అతని ఇంటిలో అతని కుటుంబం ఎదుటే దారుణంగా దాడి చేసి చంపేశారు.

నైసామ్, అజ్మల్, అనూప్, మహ్మద్ అస్లాం, అబ్దుల్ కలాం అలియాస్ సలామ్, అబ్దుల్ కలాం, సఫరుద్దీన్, మన్షాద్, జసీబ్ రాజా, నవాస్, సమీర్, నజీర్, జాకీర్ హుస్సేన్, షాజీ పూవతుంగల్, షెర్నాస్ అష్రాఫ్‌లను కోర్టు దోషులుగా నిర్ధారించింది. వీరు పీఎఫ్‌ఐ, దాని రాజకీయ విభాగమైన సోషల్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియాకి అనుబంధంగా ఉన్నారు. జడ్జి శ్రీదేవి వీజీ నేరుగా దోషులకు శిక్షను ఖరారు చేశారు. శిక్ష యొక్క పరిమాణంపై వాదనల సమయంలో, ప్రాసిక్యూషన్ గరిష్ట శిక్షలను విధించాలని కోర్టును అభ్యర్థించింది, అయితే ఈ కేసు మరణశిక్షను సమర్థించే అరుదైన కేటగిరీ కిందకు రాదని డిఫెన్స్ వాదించింది. అలప్పుజాలోని ప్రభుత్వ వైద్య కళాశాలలో దోషులకు మానసిక స్థైర్య పరీక్ష కూడా నిర్వహించాలని కోర్టు ఆదేశించింది.

Next Story