నిఫా క‌ల‌క‌లం.. కేర‌ళ‌లో 12 ఏళ్ల బాలుడి మృతి

12 year old boy dies of Nipah virus in Kerala.మ‌రోసారి కేర‌ళ‌లో నిఫా వైర‌స్ క‌ల‌క‌లం సృష్టిస్తోంది. ఈ వైర‌స్ బారిన

By తోట‌ వంశీ కుమార్‌  Published on  5 Sep 2021 4:29 AM GMT
నిఫా క‌ల‌క‌లం.. కేర‌ళ‌లో 12 ఏళ్ల బాలుడి మృతి

మ‌రోసారి కేర‌ళ‌లో నిఫా వైర‌స్ క‌ల‌క‌లం సృష్టిస్తోంది. ఈ వైర‌స్ బారిన ప‌డిన 12 ఏళ్ల బాలుడు మృతి చెందాడు. ప‌రిస్థితి విష‌మించ‌డంతో ఈరోజు(ఆదివారం) ఉద‌యం 5 గంట‌ల స‌మ‌యంలో బాలుడు ప్రాణాలు కోల్పోయాడ‌ని ఆ రాష్ట్ర ఆరోగ్య మంత్రి వీణా జార్జ్ ప్ర‌క‌టించారు. ఈ ఘ‌ట‌న కోజికోడ్ లో చోటుచేసుకుంది.

ఈ నెల 3న 12 ఏళ్ల బాలుడు నిషా వైర‌స్ ల‌క్ష‌ణాల‌తో కోజికోడ్‌లోని ఓ ఆస్ప‌త్రిలో చేరి చికిత్స పొందుతున్నాడు. అయితే.. ప‌రిస్థితి విష‌మించ‌డంతో ఈ రోజు తెల్ల‌వారుజామున మృతి చెందాడు. బాలుడి న‌మూనాల‌ను పుణెలోని నేష‌న‌ల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ వైరాల‌జీ ల్యాబ్‌కి పంపగా.. నిఫా వైర‌స్ ఉన్న‌ట్లు తేలింది. ఈ విష‌యాన్ని ప్ర‌భుత్వం కూడా ధృవీక‌రించింది. గ‌త రాత్రి నుంచే బాలుడితో కాంటాక్ట్‌లో ఉన్న వారంద‌రినీ గుర్తించే ప్ర‌క్రియ‌ను చేప‌ట్టిన‌ట్లు ఆ రాష్ట్ర ఆరోగ్య మంత్రి వీణా జార్జ్ తెలిపారు. కాగా..బాలుడి కుటుంబంలో ప్రస్తుతం ఎవరికి వైరస్‌కు సంబందించిన లక్ష‌ణాలు లేవ‌న్నారు. ఐన‌ప్ప‌టికి ముందు జాగ్ర‌త్త చ‌ర్య‌గా వారిని ఐసోలేష‌న్‌కు పంపేందుకు ఏర్పాట్లు చేసిన‌ట్లు చెప్పారు. కోజికోడ్‌లో పరిస్థితిని సమీక్షించడానికి ఇప్పటికే అధికారుల బృంధాన్ని ఏర్పాటు చేసి అక్క‌డికి పంపిన‌ట్లు మంత్రి వివ‌రించారు.

కాగా.. 2018లో దేశంలో తొలిసారి నిఫా వైర‌స్ కేసు కేరళలో న‌మోదైంది. ఆ వైర‌స్ వ‌ల్ల నెల రోజుల వ్య‌వ‌ధిలో 17 మంది మృత్యువాత ప‌డ్డాగా.. మ‌రో 18 కేసులు న‌మోదు అయ్యాయి. మ‌రోసారి ఆ రాష్ట్రంలో నిఫా వైర‌స్ కార‌ణంగా బాలుడు మ‌ర‌ణించ‌డంతో క‌ల‌క‌లం రేగుతోంది. ఈ ఘ‌ట‌న‌తో ఆ రాష్ట్ర ప్ర‌భుత్వం అప్ర‌మ‌త్తం అయ్యింది.

Next Story