మహారాష్ట్రలో భారీ పేలుడు.. 12 మంది మృతి

మహారాష్ట్రలోని నాగ్‌పూర్ జిల్లా కాటోల్ పట్టణంలో భారీ పేలుడు సంభవించింది.

By -  అంజి
Published on : 1 March 2026 10:30 AM IST

Nagpur Factory Blast, SBL Energy Limited, Katol Tehsil, Explosion News, Maharashtra Accident, Rescue Operations, Gold Rate Nagpur

మహారాష్ట్రలో భారీ పేలుడు.. 12 మంది మృతి 

మహారాష్ట్రలోని నాగ్‌పూర్ జిల్లా కాటోల్ పట్టణంలో భారీ పేలుడు సంభవించింది. కాటోల్‌ తహసీల్‌లో ఉన్న ఎస్‌బీఎల్ ఎనర్జీ లిమిటెడ్ పేలుడు పదార్థాల తయారీ కేంద్రంలో శనివారం తెల్లవారుజామున సంభవించిన భారీ పేలుడులో 12 మంది కార్మికులు దుర్మరణం పాలయ్యారు. మరో 15 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు. తెల్లవారుజామున పని జరుగుతుండగా ఈ పేలుడు సంభవించింది. దీని ధాటికి ఫ్యాక్టరీ ప్రధాన భవనం పూర్తిగా కుప్పకూలి శిథిలమైపోయింది.

కటోల్ తహసీల్‌లోని రౌల్‌గావ్‌లోని మైనింగ్ మరియు పారిశ్రామిక పేలుడు పదార్థాల తయారీ సంస్థ అయిన ఎస్‌బిఎల్ ఎనర్జీ లిమిటెడ్ ఫ్యాక్టరీలో పేలుడు సంభవించిందని పోలీసులు తెలిపారు. పేలుడు జరిగిన వెంటనే గాయపడిన వారిని నాగ్‌పూర్‌లోని ఆసుపత్రికి తరలించినట్లు పోలీసులు తెలిపారు. పేలుడు శబ్దం పరిసర ప్రాంతాల్లో కిలోమీటర్ల మేర వినిపించడంతో స్థానిక ప్రజలు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. భవనం కుప్పకూలడంతో మరికొందరు కార్మికులు శిథిలాల కింద చిక్కుకున్నట్లు తెలుస్తోంది.

ఫైర్ బ్రిగేడ్, పోలీస్ మరియు రెస్క్యూ టీమ్‌లు యుద్ధ ప్రాతిపదికన సహాయక చర్యలు చేపడుతున్నాయి. పేలుడు ధాటికి ఫ్యాక్టరీకి చెందిన శిథిలాలు అర కిలోమీటరు దూరం వరకు చెల్లాచెదురుగా పడ్డాయి. గాయపడిన వారిని సమీప ఆసుపత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు. జిల్లా యంత్రాంగం మరియు సీనియర్ పోలీస్ అధికారులు ఘటన స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షిస్తున్నారు. ఫ్యాక్టరీలో భద్రతా ప్రమాణాలు పాటించారా లేదా? అసలు పేలుడుకు గల కారణం ఏమిటి? అనే కోణంలో విచారణ చేపట్టారు.

Next Story