హర్యానా రాష్ట్రంలోని యమునా నగర్‌లో పెను ప్రమాదం తప్పింది. దట్టమైన పొగమంచు కారణంగా అంబాలా-సహారన్‌పూర్ హైవేపై 22 వాహనాలు ఒకదానికొకటి ఢీకొనడంతో 12 మంది గాయపడ్డారు. ఆదివారం ఉదయం పంజాబ్ నుంచి సుమారు 22 వాహనాలు వెళ్తుండగా ఈ ఘటన జరిగిందని పోలీసులు ధృవీకరించారు. దట్టమైన పొగమంచు యమునా నగర్‌ను చుట్టుముట్టింది. ఇది రోడ్లపై వచ్చే వాహనాలను చూడకూండా చేసింది. దీంతో జాతీయ రహదారిపై ఒకదానికొక్కటి సుమారు 22 వాహనాలు ఢీకొన్నాయి. ఆదివారం ఉదయం పంజాబ్ నుంచి సుమారు 22 వాహనాలు వెళ్తున్నాయి.
ప్రమాదాలు చాలా తీవ్రంగా ఉన్నాయని, చాలా వాహనాలు పూర్తిగా దెబ్బతిన్నాయని, ఈ ప్రమాదాల్లో సుమారు డజను మంది గాయపడ్డారని ట్రాఫిక్ ఎస్‌హెచ్‌ఓ లుకేష్ కుమార్ తెలిపారు. పోలీసు బృందం వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని వాహనాలను రోడ్డుపై నుంచి తొలగించడం ప్రారంభించిందని, గాయపడిన వారందరినీ ఆసుపత్రికి తరలించామని ఆయన తెలిపారు. ఎటువంటి ప్రాణనష్టం జరగలేదని, అయితే నలుగురికి తీవ్ర గాయాలయ్యాయని ఎస్‌హెచ్‌ఓ లుకేష్ కుమార్ తెలిపారు.
వాహనాలు ఢీకొనడంతో హైవేపై చాలాసేపు ట్రాఫిక్ జామ్ ఏర్పడి ఇతర ప్రయాణికులకు అసౌకర్యం కలిగింది. గత రెండు రోజులుగా దట్టమైన పొగమంచు కారణంగా దృశ్యమానత చాలా తక్కువగా ఉంది.పొగమంచు మధ్య డ్రైవింగ్ చేస్తున్నప్పుడు తమ వాహనంలోని డిప్పర్లు, ఫాగ్ లైట్లను ఆన్ చేయాలని డ్రైవర్లకు లోకేష్ రాణా విజ్ఞప్తి చేశారు.