ఏప్రిల్‌లో బ్యాంకులకు 12 రోజులు సెలవులు.. ఏఏ రోజుల్లో అంటే..

12 Bank Holidays In April. ఏప్రిల్‌ నెలలో మొత్తం బ్యాంకులకు 12 రోజులు సెలవులు రానున్నాయి.

By Medi Samrat  Published on  23 March 2021 2:18 PM GMT
12 Bank Holidays In April

ఏప్రిల్‌ నెల రాబోతోంది. అయితే ముఖ్యమైన బ్యాంకు లావాదేవీలు ఉన్నాయా..? అయితే ముందస్తుగా జాగ్రత్తలు పడండి. ఏప్రిల్‌ నెలలో మొత్తం బ్యాంకులకు 12 రోజులు సెలవులు రానున్నాయి. ఏప్రిల్‌ నెలలో బ్యాంకులు పని చేసేది కేవలం 18 రోజులు మాత్రమే. సెలవులకు అనుగుణంగా బ్యాంకు పనులు పూర్తి చేసుకుంటే మంచిది. అలాగే మార్చి నెలలో 27 నుంచి ఏప్రిల్‌ 4 మధ్య బ్యాంకులకు ఏడు రోజుల పాటు సెలవులు రానున్నాయి. అందుకే ముందస్తుగా లావాదేవీల పనులను పూర్తి చేసుకుంటే మంచిది.

రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) సెలవుల క్యాలెండరర్‌ ప్రకారం.. ఏపీ, తెలంగాణలో ఏప్రిల్ నెలలో 12 రోజులు మూసివేయబడతాయి. ఈ 12 రోజులలో 6 సాధారణ సెలవులు కాగా, మిగతా 6 సెలవులు గుడ్‌ ఫ్రైడే, ఉగాది, శ్రీరామనవమితో పాటు బాబూ జగ్జీవన్‌రామ్‌ జయంతి ఉన్నాయి.

ఏప్రిల్‌లో బ్యాంక్ సెలవులు:

ఏప్రిల్‌ 1- వార్షిక ఖాతాల సందర్భంగా మూసివేత

ఏప్రిల్‌ 2 - గుడ్‌ ఫ్రైడే

ఏప్రిల్ 4- ఆదివారం

ఏప్రిల్ 5 - బాబు జగ్జీవన్ రామ్ పుట్టినరోజు

ఏప్రిల్ 10 - రెండవ శనివారం

ఏప్రిల్ 11 - ఆదివారం

ఏప్రిల్ 13 - ఉగాది పండుగ

ఏప్రిల్ 14 - డా. బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి

ఏప్రిల్ 18 - ఆదివారం

ఏప్రిల్ 21 - శ్రీరామ నవమి

ఏప్రిల్ 24 - నాలుగవ శనివారం

ఏప్రిల్ 25 - ఆదివారం




Next Story