1 Covid patient can infect 406 people in 30 days. ప్రజలు ఇలాగే భౌతిక దూరం పాటించకుండా వ్యవహరిస్తే 30 రోజుల్లో ఒక్కో కరోనా పేషెంట్ నుండి.. ఏకంగా 406 మందికి ఈ మహమ్మారి వ్యాపిస్తుందని
By Medi Samrat Published on 27 April 2021 8:58 AM GMT
కరోనా కారణంగా రోజుకు వేలల్లో మృత్యువాత పడుతున్నా.. కొందరు మాత్రం తమకేమీ పట్టనట్టు వ్యవహరిస్తున్నారు. ఎటువంటి జాగ్రత్తలు పాటించకుండా గుంపులు గుంపులుగానే తిరుగుతున్నారు. అయితే.. ప్రజలు ఇలాగే భౌతిక దూరం పాటించకుండా వ్యవహరిస్తే 30 రోజుల్లో ఒక్కో కరోనా పేషెంట్ నుండి.. ఏకంగా 406 మందికి ఈ మహమ్మారి వ్యాపిస్తుందని కేంద్రం వెల్లడించింది.
కేంద్ర ఆరోగ్య శాఖ సంయుక్త కార్యదర్శి లవ్ అగర్వాల్ మాట్లాడుతూ.. కరోనా పాజిటివ్ వచ్చిన వ్యక్తులు భౌతిక దూరం పాటించకుంటే 30 రోజుల్లోనే వందలాది మందికి కరోనా వ్యాపిస్తుందన్న విషయం పలు యూనివర్సిటీల అధ్యయనాల్లో వెల్లడైందని అన్నారు. ప్రజలు భౌతిక దూరం పాటించకుండా వ్యవహరిస్తే 30 రోజుల్లో ఒక్కో కరోనా పేషెంట్ నుండి.. ఏకంగా 406 మందికి ఈ మహమ్మారి వ్యాపిస్తుందని తెలిపారు.
ఇక ప్రజలు గుంపులు గుంపులుగా తిరగడం 50 శాతం తగ్గితే.. ఒక్కో కరోనా రోగి నుంచి 15 మందికి మహమ్మారి వ్యాపిస్తున్నట్టు తేలిందన్నారు. అదే 75 శాతానికి తగ్గితే కేవలం 2.5 మందికే అంటుతుందన్నారు. ఒక కరోనా రోగి ఆరడుగుల భౌతిక దూరం పాటించినా.. మరొకరికి మహమ్మారి సోకుతుందన్నారు.
అలాగే.. జనాలు మాస్కులను సరిగ్గా పెట్టుకోకపోయినా మహమ్మారి వ్యాప్తి 90 శాతం పెరిగే ముప్పుందన్నారు. మాస్కులను ప్రతి ఒక్కరూ ధరించడం వల్ల కరోనా సోకే ముప్పు కేవలం 1.5 శాతమేనని.. దానికి తోడుగా భౌతిక దూరాన్ని పాటిస్తే ఆ ముప్పు మరింత తగ్గుతుందని చెప్పారు. అందుకే ప్రజలంతా మాస్కులు ధరించి భౌతిక దూరాన్ని తప్పక పాటించాల్సిందేనని తేల్చి చెప్పారు.