అతివేగంతో అదుపు తప్పిన బస్సు.. 23 మంది దుర్మరణం

By అంజి
Published on : 29 Jan 2020 11:29 AM IST

అతివేగంతో అదుపు తప్పిన బస్సు.. 23 మంది దుర్మరణం

మహారాష్ట్రలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. నాసిక్‌లోని దియోలా ప్రాంతంలో ఆటో, బస్సు ఒకదానికొకటి ఢీకొన్నాయి. ఆ తర్వాత బస్సు అదుపు తప్పి రోడ్డు పక్కనే ఉన్న బావిలో పడిపోయింది. ఈ ప్రమాదంలో 23 మంది దుర్మణం పాలయ్యారు. కాగా అతివేగం కారణంగా ఈ ప్రమాదం జరిగినట్లు స్థానికులు చెబుతున్నారు. ఆటోను బస్సు ఢీకొట్టిన సమయంలో.. ఆటోలో ఉన్న నలుగురు అక్కడికక్కడే మృతి చెందారు. బస్సు మాలెగావ్‌ నుంచి కల్వాన్‌ వస్తుండగా ఈ ఘటన జరిగింది. బస్సు నీటిలో పడడంటంతో అందులో ఉన్న ప్రయాణికులు ఊపిరాడక మృతి చెందారు.

Nashik road accident

ఇప్పటి వరకు 23 మంది చనిపోగా, మరో 30 మంది ప్రయాణికులు సిబ్బంది కాపాడారు. క్షతగాత్రులను వెంటనే స్థానిక ఆస్పత్రికి తరలించారు. బావి లోతు దాదాపు 70 అడుగుల లోతు ఉందని అక్కడున్న ఓ అధికారి వెల్లడించారు. ప్రమాద తీవ్రత పెరిగే అవకాశం ఉందని.. ప్రస్తుతం ఘటనా స్థలంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయని ఆ అధికారి తెలిపారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశాలున్నాయని సమాచారం.

Nashik road accident

Next Story