చంద్రబాబు ఆ వ్యాధితో బాధపడుతున్నారు
By సుభాష్
వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై ఆరోపణలు గుప్పించారు. ట్విట్టర్ వేదికగా విజయసాయిరెడ్డి విమర్శల వర్షం కురిపించారు. చంద్రబాబు ఓ మానసిక వ్యాధితో బాధపడుతున్నారని, ఆ వ్యాధి లక్షణాలను చెబుతూ విజయసాయిరెడ్డి ట్విట్ చేశారు. కాగా, చంద్రబాబు విషయంలో ముందుగా స్పందించేది విజయసాయిరెడ్డినే. వైసీపీపై గానీ, ప్రభుత్వంపై గానీ చంద్రబాబు ఏదైన విమర్శలు గుప్పిస్తే వెంటనే విజయసాయిరెడ్డి స్పందిస్తుంటారు. తాజాగా మరోసారి విజయసాయిరెడ్డి చంద్రబాబుపై సెటైర్లు వేశారు. మానసిక వ్యాధితో బాధపడుతున్నట్లుగా పేర్కొంటూ ట్విట్ చేశారు.
''చంద్రబాబు నార్సిస్సిస్టిక్ పర్సనాలిటీ డిజార్డర్ (Narcissistic personality disorder) అనే మానసిక వ్యాధితో బాధ పడుతున్నాడు. తను లేకపోతే ప్రపంచమే లేదనే భ్రాంతి. అందరూ పనికిమాలిన వారనే భావన దీని లక్షణాలు. హింసను ప్రేరేపించేలా మాట్లాడటం, ప్రోత్సహించడం దాని కోవలోకే వస్తాయి." అని ట్విట్ చేశారు.