ఏపీ టీడీపీ ఎమ్మెల్సీ నారా లోకేష్ వైసీపీ ప్రభుత్వం పై ఆగ్రహం వ్యక్తం చేశారు. మొన్నే అమ్మఒడి పథకం కింద విద్యార్థుల చదువుకోసం డబ్బులిస్తున్నట్లు నాటకాలాడి...ఇప్పుడు టాక్స్ లు, ఛార్జీల పెంపులతో ఇచ్చిన దానికన్నా రెట్టింపు దోచుకునేందుకు వైసీపీ సిద్ధమవుతుందంటూ విమర్శించారు.

''బాదుడే, బాదుడు. ఎన్నికల ముందు పెంచుకుంటూ పోతా అని @ysjagan గారు అంటే సంక్షేమ కార్యక్రమాలు అనుకున్నా. ఆయన అన్నది ప్రజల పై భారం పెంచడం అని అర్థమైంది. ఆర్టీసీ ఛార్జీలు పెంచేసారు, ఇప్పుడు పెట్రోల్ ధరలు పెంచేసారు.''

''రేపో, మాపో విద్యుత్ ఛార్జీలు పెంచడానికి సిద్ధం అవుతుంది వైకాపా ప్రభుత్వం. పేదల రక్తాన్ని జలగలా సైలెంట్ గా లాగేస్తున్నారు జగన్ గారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రజల పై పెట్రో బాంబు వెయ్యడం దారుణం. పెంచిన ధరలు వెంటనే తగ్గించాలి.'' రివర్స్ టెండరింగ్ అంటే ఛార్జీలు, రేట్లు పెంచి పేదలని పిండేయడం అని @ysjagan గారు కొత్త అర్ధం చెప్పారు'' అని దుయ్యబట్టారు.''రాయలసీమ, ఉత్తరాంధ్ర ద్రోహి @ysjagan గారే. ఉత్తరాంధ్రకి, రాయలసీమకి వస్తాం అన్న పెద్ద కంపెనీలను ఛీ కొట్టి అక్కడ యువతకి ఉద్యోగాలు రాకుండా అడ్డుపడుతున్నారు. కొత్త ఉద్యోగాలు సృష్టించకుండా ఉన్న కార్యాలయాలు అటు, ఇటు మార్చి అభివృద్ధి చేసా అంటే నమ్మేవారు ఎవరూ లేరు.'' ''అధికారంలో ఉన్నాం అనే సోయ లేకుండా ఆందోళనలు చేస్తూ టీడీపీ నాయకులను అడ్డుకోవడం హీరోయిజం అనుకుంటున్నారు వైకాపా నేతలు. వైకాపా నేతలకు దమ్ము, ధైర్యం ఉంటే వారి నాయకుడు జగన్ గారిని అడ్డుకోవాలి.'' ''మూడు ముక్కలాటలో అభివృద్ధి ప్రణాళిక ఎక్కడ ఉందని నిలదీయాలి. ఉత్తరాంధ్ర, రాయలసీమని ఎలా అభివృద్ధి చెయ్యబోతున్నారని ప్రశ్నించాలి. అంతేగానీ జగన్ గారి తుగ్లక్ నిర్ణయాలకు అందరూ జై కొట్టాలి అని హడావిడి చేస్తే మీరు కూడా జగ్లక్ లు అని ప్రజలు ఫిక్స్ అవుతారు.'' అని లోకేష్ ట్వీట్ చేశారు.రాణి యార్లగడ్డ

Next Story