సీఎం జగన్ ఇసుకాసుర లీలలు బయటపడ్డాయి: నారా లోకేష్
By న్యూస్‌మీటర్ తెలుగుPublished on : 13 Nov 2019 2:28 PM IST

అమరావతి: సీఎం వైఎస్ జగన్ ఇసుకాసుర లీలలు బయటపడ్డాయని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేషన్ విమర్శించారు. ఐదు నెలల్లో 42 మంది భవన నిర్మాణ కార్మికులని మింగేసిన పాపం వైసీపీ నేతలను ఊరికే వదలదన్నారు. భవన నిర్మాణ కార్మికుల నోటి దగ్గర కూడు లాక్కొని వైసీపీ నేతలు అవినీతి కోటలు నిర్మిస్తున్నారని నారా లోకేష్ ఆరోపించారు. వరదల వల్లనే ఇసుక దొరకడం లేదని చిలక పలుకులు పలుకుతున్న సీఎం జగన్ భవన నిర్మాణ కార్మికులకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. సిమెంట్ కంపెనీల నుంచి జే ట్యాక్స్‌లు వసూలు అయ్యే వరకూ వరద కారణంగా ఇసుక ఇతర రాష్ట్రాలకు తరలిపోతూనే ఉంటుందని నారా లోకేష్ ఎద్దేవా చేశారు. వైసీపీ ఇసుక మాఫియా లిస్ట్ ర్యాంపుల దగ్గర క్యూ కట్టిన ట్రాక్టర్లలా పెరుగుతూనే ఉందని టీడీపీ నేత నారా లోకేష్ ట్విట్టర్ వేదికగా విమర్శించారు.
�
�
Next Story