నందీ సిస్టర్స్‌ టు బాల్కనీ సిస్టర్స్‌

By మధుసూదనరావు రామదుర్గం  Published on  14 Aug 2020 8:00 PM IST
నందీ సిస్టర్స్‌ టు బాల్కనీ సిస్టర్స్‌

ఏదో కూనీరాగం తీసే వాళ్ళో.. బాత్‌రూమ్‌ సింగర్లో అయితే వారి గురించి పెద్దగా అనుకోవాల్సిన పనిలేదు. చాలా మందికి మంచి గాయకులు కావాలని ఆశ ఉంటుంది. కలలోనే చిత్ర, సునీత, గీతామాధురీల కంటే సుపర్బ్‌గా పాడేస్తుంటారు. అందరూ చప్పట్లో చప్పట్లు.. ఉలిక్కిపడి లేస్తే ఏముండదు. అయితే అలా కలలకే పరిమితమైన గాయకులు కారు వీళ్ళు. సంప్రదాయం.. మోడ్రన్‌ రెంటినీ మిక్సీలో వేసి కొట్టినట్లుంటుంది వీరి డ్రెస్‌లు.సీతలా బుద్దిగా రెండుజడలు వేసుకుంటారు. కాళ్ళకు మువ్వలు అలంకరించుకుంటారు. అంతలోనే జీన్స్‌ ప్యాంటూ కనిపిస్తుంది.. కళ్ళకు పోష్‌గా గాగుల్స్‌ కనిపిస్తాయి. వారి గిటార్‌ కచేరీ అనూహ్యం.

అంతర, అంకిత వీరిద్దరూ నందిని సిస్టర్స్‌.. బాల్కనీ సిస్టర్స్‌ గా మారడానికి చాలా హంగామే చేశారు. మొదట వీరు తమ దుస్తులకు ప్రాధాన్యం ఇచ్చారు. సంప్రదాయం.. ఆదునికత కలబోసేలా జాగ్రత్తలు తీసుకున్నారు. అందుకే సంప్రదాయ జడలు.. జీన్స్‌ ప్యాంట్‌తో తమ పాటల తత్వాన్ని చెప్పకనే చెబుతున్నారు. రేషమచ్యా రేఘానీ అంటూ సంగీత సంద్రంలో ప్రేక్షకుల్ని ముంచెత్తుతున్నారు. సోషల్‌ మీడియాలోనే కచేరీలు పెట్టి కిర్రెక్కిస్తున్నారు. రెండంటే రెండే నిమిషాల సమయంలో పాడి హోరెత్తించడమే కాదు.. తమ క్లిప్‌కు నాలుగువేల మిలియన్ల వ్యూస్‌ రావడంతో ఇక ఈ దారే సుగమసంగీత దారి అనుకుంటున్నారు. కొన్ని పాటలన్నీ ఒక చోట చేర్చి ఈ సీరీస్‌కు బాల్కనీ కన్‌సర్ట్స్‌ అని నామకరణం చేశారు.

ఇద్దరు అక్కాచెల్లెళ్ళలో అంతర (21) నేపథ్య గాయని. అంతర ఏ ఆర్‌ రెహమాన్‌ వంటి సుప్రసిద్ధ సంగీత దర్శకుల వద్ద పనిచేసింది. చిన్నప్పుడే టాలెంట్‌ రియాలిటీ షో సారేగామాలో పాల్గొని ప్రముఖ గాయని కవితా కృష్ణమూర్తి ప్రశంసలు అందుకుంది. అంతర తన సోదరి అంకితతో కలిసి బాల్కనీ కచేరీకి శ్రీకారం చుట్టింది.

మాది అసోం ఎపుడు బిహూ పండగకు మాత్రం తమ సొంతూరిలో కొద్ది కాలం ఉండేవారు. అప్పుడు బంధువులతో ఫ్రెండ్స్‌తో సరదాగా పాటకచేరీలు చేసేవారు. అయితే పూణేకు వచ్చాక ఇది మిస్‌ కావడం గమనించారు. ముఖ్యంగా లాక్‌డౌన్‌ సమయంలో ఎటూపోవడానికి వీలు లేకపోవడంతో వీరిద్దరూ బాల్కనీ కచేరీలు చేసి సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేసేవారు. చాలా మంది నెటిజన్లు ఖాళీ సమయం ఉండటంతో ఇలాంటి మ్యూజికల్‌ కన్సర్ట్స్‌ ను బాగా ఎంజాయ్‌ చేశారు. అందుకే మిలియన్ల కొద్ది వ్యూస్‌ వచ్చి పడ్డాయి. మొదట్లో వీరిని క్లాప్‌ అండ్‌ కప్‌ సిస్టర్స్‌ అని పిలిచేవారు. ఎందుకంటే వీరు బల్లపై దరువేస్తూ చప్పట్లు కొడుతూ తదనుగుణంగా పాటలు పాడేవారు. బాజీరావు మస్తానీ లోని పింగా పాటకు వీరు చాల ఫేమస్‌ అయ్యారు.

అంతర, అంకిత అన్నిభాషల వారి వద్ద కెళ్ళి పాటలు కొన్ని ఎంపిక చేసుకుని పాడుతున్నారు. ప్రజల మనసుల్లో సుస్థిర స్థానం సంపాదించుకుంటున్నారు. మ్యూజిక్‌ హాజ్‌ నో లాంగ్వేజీ అండ్‌ రీజన్‌ అన్న మాటను నిజమని నిరూపిస్తున్నారు. సో బాల్కనీ సిస్టర్స్‌కు ఖుదాస్‌ చెబుదామా!!

Next Story