లస్ట్ స్టోరీస్ ఎపిసోడ్ పూర్తి చేస్తోన్న నందినిరెడ్డి.!

By అంజి  Published on  20 Dec 2019 2:36 AM GMT
లస్ట్ స్టోరీస్ ఎపిసోడ్ పూర్తి చేస్తోన్న నందినిరెడ్డి.!

లేడి టాలెంటెడ్ డైరెక్టర్ నందినిరెడ్డి దర్శకత్వంలో సమంత అక్కినేని ప్రధాన పాత్రలో వచ్చిన 'ఓ బేబీ' సినిమా ఆల్ సెంటర్స్ నుండి మంచి పాజిటివ్ టాక్ తెచ్చుకుని బాక్సాఫీస్ వద్ద మంచి ఓపెనింగ్స్ తో సక్సెస్ ఫుల్ గా సూపర్ హిట్ సినిమాగా నిలిచింది. దాంతో నందిని రెడ్డి తరువాత సినిమా పై ప్రేక్షకుల్లో బాగానే ఆసక్తి పెరిగింది. ఇక నందిని రెడ్డి 'ఓ బేబీ' చిత్రీకరణ సమయంలోనే వైజయంతి అనుబంధ సంస్థ స్వప్న సినిమాస్ ప్రొడక్షన్ లో ఓ సినిమా చేయడానికి అంగీకరించారు. అయితే నందిని రెడ్డి ప్రస్తుతం లస్ట్ స్టోరీస్ వెబ్ సిరీస్ కి పని చేస్తోంది. లస్ట్ స్టోరీస్ లో ఆమె ఒక ఎపిసోడ్ డైరెక్ట్ చేస్తోంది. ఇప్పటికే ఆ ఎపిసోడ్ షూటింగ్ కూడా పూర్తయింది.

కాగా పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుగుతుంది. వచ్చే వారంతో ఫస్ట్ కాపీ రెడీ అవ్వనుంది. ప్రస్తుతం నందిని రెడ్డి తన చిత్రం స్క్రిప్ట్ పైనే వర్క్ చేస్తున్నారు. ఈ చిత్రం ఒక ప్యూర్ లవ్ స్టోరీ అని తెలుస్తోంది. ఈ చిత్రాన్ని ప్రియాంక దత్ నిర్మించనున్నారు. 'మహానటి మరియు ఓ బేబీ' సినిమాలకు అద్భుతమైన మనోహరమైన సంగీతాన్ని అందించిన మిక్కీ జె మేయర్ ఈ సినిమాకి కూడా సంగీతం అదించనున్నారు. ఇక ఈ సినిమాకి లక్ష్మీ భూపాల్ డైలాగ్స్ రాస్తున్నారు.

Next Story
Share it