'సరిలేరు నీకెవ్వరు'.. షూట్ కి ప్యాకప్ !

By రాణి  Published on  18 Dec 2019 1:13 PM GMT
సరిలేరు నీకెవ్వరు.. షూట్ కి ప్యాకప్ !

హైదరాబాద్ : సక్సెస్ ఫుల్ డైరెక్టర్ గా అనిల్ రావిపూడి - సూపర్ స్టార్ గా మహేష్ బాబు' కలిసి చేస్తోన్న కమర్షియల్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ 'సరిలేరు నీకెవ్వరు' సినిమా షూటింగ్ ఈ రోజుతో పూర్తయింది. ఈ విషయాన్ని తాజాగా చిత్ర బృందమే సోషల్ మీడియా ద్వారా తెలిపింది. అనిల్ రావిపూడి ట్వీట్ చేస్తూ.. 'మా సరిలేరు నీకెవ్వరు షూటింగ్ ప్రయాణాన్ని జూలై 5న ప్రారంభించాము. చిరస్మరణీయమైన ఈ ప్రయాణం ఈ రోజుతో పూర్తయింది. ఈ సంక్రాంతి సినీ అభిమానుల‌కు, ప్రేక్ష‌కుల‌కు, ఫ్యాన్స్‌కు మ‌ర‌చిపోలేని సంక్రాంతి అవుతుంది'' అని అనిల్ రావిపూడి ట్వీట్ లో రాశారు.

ఇక ఈ సినిమా గురించి ఇంకో ఇంట్రస్టింగ్ న్యూస్ కూడా తెలిసింది. సినిమా మొత్తంలో మహేష్ బాబు తరువాత ఆ రేంజ్ లో హైలెట్ అయ్యేది బండ్ల గణేషేనట. 'దూకుడు'లో బ్రహ్మానందం మహేష్ బాబు కాంబినేషన్ సీన్స్ ఎలా ఉంటాయో, అలాగే క్లైమాక్స్ లో బ్రహ్మానందం ట్రాక్ ఎంత బాగా హిట్ అయిందో... ఈ సినిమాలో కూడా అచ్చం బండ్ల గణేష్ ట్రాక్ కూడా ఆ రేంజ్ లో హిట్ అవుతుందట. అయితే బండ్ల గణేష్ నటుడిగా కనిపించి దాదాపు ఏడు సంవత్సరాలు అయిపోయింది. ఎట్టకేలకూ సూపర్ స్టార్ సినిమాతో మళ్లీ రీ ఎంట్రీ ఇస్తున్నాడు.

భారీ అంచనాలు పెట్టుకున్న ఈ చిత్రం రిలీజ్ కి ముందే రికార్డ్ స్థాయిలో శాటిలైట్ రైట్స్ అమ్ముడుపోయాయి. ఇక ఈ సినిమాలో మహేష్ సరసన రష్మిక మండన్న హీరోయిన్ గా నటిస్తోంది. అలాగే ఒక్కప్పటి లేడీ సూపర్ స్టార్ విజయశాంతి మరో కీలక పాత్రలో నటిస్తోంది. ప్రకాష్‌ రాజ్‌, రాజేంద్రప్రసాద్‌, సంగీత, ఇతర పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రానికి దేవిశ్రీప్రసాద్‌ సంగీతం అందిస్తున్నాడు. కానీ దేవి నుంచి ఇప్పటివరకూ గొప్పగా పేలిన సాంగ్ ఒక్కటీ రాలేదు. దిల్‌ రాజు శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌ సమర్పణలో రామబ్రహ్మం సుంకర ఈ సినిమాని నిర్మిస్తున్నారు. 2020 సంక్రాంతి కానుకగా జనవరి 11న వరల్డ్‌ వైడ్‌గా ఈ చిత్రం విడుదల కానుంది.Next Story
Share it