118 హిట్ తరువాత ఈస్ట్ కోస్ట్ ప్రొడక్షన్స్ బ్యానర్‌లో నందమూరి కళ్యాణ్ రామ్
By న్యూస్‌మీటర్ తెలుగు Published on 29 Oct 2019 4:55 PM ISTడైనమిక్ హీరో నందమూరి కల్యాణ్ రామ్ ఈ సంవత్సరం యాక్షన్ సస్పెన్స్ థ్రిల్లర్ '118' తో భారీ విజయాన్ని అందుకున్నారు. ఈస్ట్ కోస్ట్ ప్రొడక్షన్స్ బ్యానర్‌లో వచ్చిన ఈ సినిమా అటు విశ్లేషకులను.. ఇటు ప్రేక్షకులను అలరించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఈ కాంబినేషన్ మరొకసారి పట్టాలెక్కబోతోంది. ఇటీవల కాలంలో తమిళ్ స్టార్ విజయ్ నటించిన “విజిల్” చిత్రాన్ని తెలుగులో దిగ్వియజంగా సమర్పించిన ఈస్ట్ కోస్ట్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై.. మహేష్ కోనేరు ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు.
నిర్మాత మహేశ్ కోనేరు మాట్లాడుతూ :
దళపతి విజయ్ నటించిన 'విజిల్' చిత్రాన్ని దీపావళికి తెలుగు రాష్ట్రాలలో విడుదల చేశాము. ఈ చిత్రం భారీ వసూళ్లతో, చక్కటి ప్రేక్షకాదరణ పొందుతోందన్నారు. ఈ శుభసందర్భంలో మా బ్యానర్‌లో మరొక కొత్త చిత్రాన్ని అనౌన్స్ చేస్తున్నందుకు సంతోషంగా ఉంది. నందమూరి కల్యాణ్ రామ్ మా బ్యానర్ కు “118” చిత్రం తో అద్భుతమైన విజయాన్ని అందించారని తెలిపారు. ఇప్పుడు మళ్ళీ మా బ్యానర్‌లో ఒక చిత్రాన్ని చేయబోతున్నందుకు సంతోషంగా ఉందన్నారు. ఒక కొత్త తరహా కథతో రూపొందబోతున్న ఈ చిత్రం వివరాలను త్వరలోనే తెలియజేస్తాం' అని నిర్మాత అన్నారు.