సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న నమ్రత సైక్లింగ్ వీడియో
By సుభాష్ Published on 3 Jun 2020 8:10 AM ISTటాలీవుడ్ సూపర్ స్టార్ ప్రిన్సి మహేష్ బాబు భార్య నమ్రత.. తన ఇద్దరు పిల్లలతో విదేశాల్లో సైక్లింగ్ చేస్తున్న ఓ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ప్రస్తుతం దేశ వ్యాప్తంగా లాక్‌డౌన్ కొనసాగుతోంది. సెలబ్రిటీల నుంచి సామాన్యుల వరకూ అందరు బయట తిరగకుండా ఇళ్లకే పరిమితం అయ్యారు. అలాంటిది విదేశాల్లో నమ్రత తన ఇద్దరు పిల్లలతో సైక్లింగ్ చేసింది. కాగా, మరి లాక్‌డౌన్ ఉన్న సమయంలో విదేశాలకు ఎప్పుడెళ్లారు.. బయటకు ఎలా వెళ్లారు అని అనుకుంటున్నారా..? ఈ వీడియో ఇప్పుడు తీసింది కాదు.. ఎప్పుడో విదేశాలకు వెళ్లినప్పుడు తీసిన వీడియో ఇది. తాజాగా ఆ వీడియోను నమ్రత తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు చేసింది. జూన్ 3వ తేదీన (నేడు) ప్రపంచ సైకిల్ దినోత్సవం. అందుకే నమ్రత సోషల్ మీడియాలో ఈ వీడియోను పోస్టు చేసి ఉంటారేమో.
జన్మనీలో బ్రెన్నర్స్ లో కుమారుడు గౌతమ్ కృష్ణతో సరదాగా సైక్లింగ్ చేసిన వీడియో తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేసింది. ప్రస్తుతం నమ్రత, తన భర్త పిల్లలతో కలిసి ఇంట్లోనే గడుపుతున్నారు. ఇక మహేష్ బాబుకు సంబంధించి ప్రతి విషయాన్ని ఆమె దగ్గరుండి చూసుకుంటోంది. తాజాగా మహేష్ పరుశురామ్ దర్శకత్వంలో 'సర్కార్ వారి పాట' సినిమా చేస్తోన్న సంగతి తెలిసిందే.