టాప్‌ ట్రెండింగ్‌లో 'ప్రభాస్‌20' .. అభిమానుల హంగామా

By సుభాష్  Published on  2 Jun 2020 7:56 AM GMT
టాప్‌ ట్రెండింగ్‌లో ప్రభాస్‌20 .. అభిమానుల హంగామా

డార్లింగ్‌ ప్రభాస్‌.. తాజాగా జిల్‌ ఫేమ్‌ రాధాకృష్ణ డైరెక్షన్‌లో ఓ పీరియాడికల్‌ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాలో పూజా హెగ్డే హీరోయిన్‌గా నటిస్తోంది. లాక్‌డౌన్‌ ముందు జార్జియాలో ఓ షెడ్యూల్‌ పూర్తి చేసుకుంది ఈ సినిమా. ఆ తర్వాత లాక్‌డౌన్‌ కారణంగా షూటింగ్‌లు అన్ని నిలిచిపోవడంతో చిత్ర బృందం అంతా హోం క్వారంటైన్‌లో ఉండిపోయింది. ఇక షూటింగ్‌లు ప్రారంభం కావడానికి సమయం పడుతుండటంతో డార్లింగ్‌ ప్రభాస్‌ తన అభిమానులకు ఓ సర్‌ప్రైజ్‌ ఇచ్చేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది.

తాజా మూవీ నుంచి ప్రభాస్‌ ఫస్ట్‌ లుక్‌ను ఈ నెల మొదటి, లేదా రెండో వారంలో విడుదల చేయనున్నట్లు సమాచారం. ఈ విషయం ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. ఫ్యాన్స్‌ 'ప్రభాస్‌20' హ్యాష్‌ట్యాగ్‌ను ట్రెండ్‌ చేస్తూ, తమ అభిమానాన్ని ట్యాగ్‌ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ ట్యాగ్‌ ట్విట్టర్‌లో నేషనల్‌ వైడ్‌ టాప్‌ ట్రెండింగ్‌లో కొనసాగుతోంది. ఈ సినిమా కోసం 'ఓ డియర్‌', 'రాధే శ్యామ్‌' అనే పేర్లను ఇప్పటికే రిజిస్టర్‌ చేయించారు. కానీ వీటిలో ఏది కూడా ఫైనల్‌ కాలేదు. యూవీ క్రియేషన్స్‌, గోపీ కృష్ణ మూవీస్‌ సంయుక్తంగా ఈ సినిమా ప్రొడ్యూస్‌ చేస్తున్నాయి. కాగా, వచ్చే సంవత్సరం ఈ సినిమా విడుదల కానుంది.

Next Story
Share it