ఎస్పీ ఫేస్‌బుక్ అకౌంట్‌ను హ్యాక్ చేసిన సైబ‌ర్ కేటుగాళ్లు

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  19 Sep 2020 7:37 AM GMT
ఎస్పీ ఫేస్‌బుక్ అకౌంట్‌ను హ్యాక్ చేసిన సైబ‌ర్ కేటుగాళ్లు

నల్గొండ జిల్లా ఎస్పీ ఏవీ రంగనాథ్ ఫేస్‌బుక్ అకౌంట్‌ను సైబ‌ర్ కేటుగాళ్లు హ్యాక్ చేశారు. అయితే ఆ కేటుగాళ్లు ఎస్పీ రంగ‌నాథ్ పేరుతో అమాయ‌కుల ద‌గ్గ‌ర నుండి డ‌బ్బు లాగ‌డం మొద‌లుపెట్టారు. ఆ సైబర్ క్రిమినల్ ఎస్పీ పేరుతో అత‌డి స్నేహితుడి వ‌ద్ద‌ నుండి రూ. 20,000 అడిగి.. గూగుల్ పే కోసం ఫోన్ నంబర్‌ను కూడా పంపాడు. ఇందుకు సంబంధించి ఫేస్‌బుక్ చాట్లు నిన్న ఉద‌యం ఎస్పీ రంగ‌నాథ్ వ‌ద్ద‌కు చేర‌డంతో ఈ విష‌యం వెలుగులోకి వ‌చ్చింది.

ఈ విష‌య‌మై ఎస్పీ రంగనాథ్ మాట్లాడుతూ.. నేను చాలా రోజుల‌ క్రితం ఈ అకౌంట్‌ను ఉప‌యోగించాన‌ని.. త్వరగా డబ్బు సంపాదించాలనే ఉద్దేశ్యంతో ఎవరో నా ఖాతాను హ్యాక్ చేశారని అన్నారు. ఫేస్‌బుక్ చాట్‌లో హ్యాక‌ర్‌ పేర్కొన్న ఫోన్ నంబర్ ఒడిశాకు చెందిన అనిత అనే మ‌హిళ‌దిగా గుర్తించారాని.. ఈ విష‌య‌మై ఫేస్‌బుక్ కు సమాచారం ఇచ్చామ‌ని.. అదృష్టవశాత్తూ, ఎవరూ మోసగాడి ఉచ్చులో పడలేదని.. ఫేస్‌బుక్ వెంటనే చర్య తీసుకుందని అన్నారు.

ఈ విష‌య‌మై త్వ‌ర‌లోనే చర్యలు తీసుకుంటామ‌న్నారు ఎస్పీ రంగ‌నాథ్. ఇక‌ముందు.. నా పేరు లేదా నా అకౌంట్‌ ‌ను పేర్కొంటూ మీకు ఏటువంటి మెసెజ్‌ వచ్చినా.. వెంట‌నే సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేయాల‌ని ఎస్పీ కోరారు.

S1

Next Story