నల్గొండ: ఘోర రోడ్డు ప్రమాదం

By సుభాష్  Published on  21 May 2020 2:50 AM GMT
నల్గొండ: ఘోర రోడ్డు ప్రమాదం

నల్గొండ జిల్లా చిట్కాల శివారులో గురువారం ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. జాతీయ రహదారిపై ఆగివున్న లారీని కారు అదుపుతప్పి వెనుక నుంచి ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందారు. మరో ఇద్దరికి తీవ్ర గాయాలు కావడంతో చికిత్స నిమిత్తం కామినేని ఆస్పత్రికి తరలించారు. మృతులు రాజమండ్రి సమీపంలోని కొత్తపల్లికి చెందిన వారుగా గుర్తించారు. కొత్తపల్లి నుంచి హైదరాబాద్‌కు కారులో వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. విషయం తెలుసుకున్న నల్గొండ డీఎస్సీ వెంకటేశ్వరరెడ్డి పరిశీలించారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం నల్గొండ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.

కాగా, నిన్నఉత్తరప్రదేశ్ లో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకున్న విషయం తెలిసిందే. కొంత మంది రైతులు జాక్‌ఫూట్‌ పండ్లను ట్రక్కులో మార్కెట్‌కు తీసుళ్తుండగా, ప్రయాణిస్తున్న ట్రక్కు మరో ట్రక్కును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆరుగురు రైతులు మృతి చెందారు. మరో రైతు తీవ్రంగా గాయపడ్డాడు. ఇలా దేశంలో రోడ్డు ప్రమాదాలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. లాక్‌డౌన్‌ కారణంగా పూర్తిగా తగ్గిన ప్రమాదాలు.. ఇటీవల లాక్‌డౌన్‌ నుంచి సడలింపులు ఇవ్వడంతో మళ్లీ ఒక్కసారిగా పెరిగిపోతున్నాయి. ప్రతి రోజు రోడ్డు ప్రమాదాలు జరుగుతూ ఎంతో అమాయకుల ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయి.

Next Story
Share it