టేబుల్ టెన్నిస్ క్రీడాకారిణి ఫేస్‌బుక్ అకౌంట్ హ్యాక్..

By Newsmeter.Network  Published on  26 Feb 2020 5:08 AM GMT
టేబుల్ టెన్నిస్ క్రీడాకారిణి ఫేస్‌బుక్ అకౌంట్ హ్యాక్..

అంతర్జాతీయ టేబుల్‌ టెన్సిస్‌ క్రీడాకారిణి నైనా జైస్వాల్‌ ఫేస్‌బుక్‌ను గుర్తుతెలియని దుండగులు హ్యాక్‌ చేశారు. దీనిపై ఆమె మంగళవారం హైదరాబాద్‌ సైబర్‌ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. నగరంలోని కాచిగూడకు చెందిన నైనా జైస్వాల్.. టేబుల్‌ టెన్నిలో అంతర్జాతీయ స్థాయిలో భారత్‌కు పలు పతకాలు అందించింది.

టేబుల్‌ టెన్నిలోనే కాదు.. చదువులోనూ ముందుండే నైనా.. ఎనిమిదేళ్ల వయసులోనే పదో తరగతి పూర్తిచేసింది. పదో ఏట ఇంటర్మీడియట్‌, 13వ ఏట డిగ్రీ, 15 ఏట పీజీ పూర్తి చేసిన ఆమె.. 17ఏళ్ల నుంచి పీహెచ్‌డీ చేయడం మొదలుపెట్టింది. తన రెండు చేతులతోనూ ఒకే సారి రాయగల నేర్పు జైస్వాల్‌ సొంతం. ఆమె ఫేస్‌బుక్‌ ఫేజికి దాదాపు 2లక్షల మంది ఫాలోవర్లు ఉన్నారు. తాజాగా.. ఆమె ఫేస్‌బుక్‌ ఫేజిని హ్యాక్‌ చేసిన దుండగుడు పాస్‌ వర్డ్ మార్చేశాడు. అంతేకాకుండా.. కొన్ని వీడియోలను అప్‌లోడ్ చేశాడు. తన ఖాతాను తాను యాక్సిస్‌ చేయలేకపోవడం.. కొన్ని వీడియోలు అప్‌లోడ్ కావడంతో..తన ఖాతా హ్యాక్‌ అయ్యిందన్న విషయం తెలుసుకున్న జైస్వాల్ పోలీసులను ఆశ్రయించింది.

Next Story