నాగ్ 'బంగార్రాజు' నుంచి త‌ప్పుకున్న చైతూ.. ఇంత‌కీ.. ఏం జ‌రిగింది..?

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  27 Sep 2019 7:37 AM GMT
నాగ్ బంగార్రాజు నుంచి త‌ప్పుకున్న చైతూ.. ఇంత‌కీ.. ఏం జ‌రిగింది..?

టాలీవుడ్ మ‌న్మ‌థుడు నాగార్జున కెరీర్ లో అత్య‌ధిక క‌లెక్ష‌న్స్ వ‌సూలు చేసిన చిత్రం 'సోగ్గాడే చిన్ని నాయ‌న‌'. అన్న‌పూర్ణ స్టూడియోస్ బ్యాన‌ర్ పై నాగార్జున ఈ చిత్రాన్ని నిర్మించారు. క‌ళ్యాణ్ కృష్ణ ఈ సినిమా ద్వారా ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌యం అయ్యారు. అన్నివ‌ర్గాల ప్రేక్ష‌కుల ఆద‌ర‌ణ‌తో సంచ‌ల‌న విజ‌యం సాధించి ఈ సినిమా నాగ్ కెరీర్ లో మైలురాయిగా నిలిచింది. దీంతో ఈ సినిమాకి సీక్వెల్ తీయాల‌ని.. నాగ్ డిసైడ్ అయ్యారు.

Image result for soggade chinni nayana

ఈ మూవీ కోసం 'బంగార్రాజు' అనే టైటిల్ ని ఎప్పుడో రిజిష్ట‌ర్ చేసారు. దీంతో ఎప్పుడెప్పుడు ఈ సినిమా సెట్స్ పైకి వెళుతుందా అని అభిమానులు ఎంతో ఆస‌క్తితో ఎదురు చూస్తున్నారు. అయితే... ఈ పాటికే బంగార్రాజు సెట్స్ పైకి వెళ్లాలి. కాని... క‌థ పై ఇంకా క‌స‌ర‌త్తులు చేయాలి అంటూ నాగార్జునమార్పులు చెబుతూనే ఉన్నార‌ట‌. ఆ సినిమాలో నాగార్జున‌తో పాటు నాగ చైత‌న్య కూడా న‌టించ‌నున్న‌ట్టు ద‌ర్శ‌కుడు క‌ళ్యాణ్ కృష్ణ‌, నాగ చైత‌న్య కూడా చెప్ప‌డం జ‌రిగింది.

Image result for nagarjuna bangarraju

లేటెస్ట్ న్యూస్ ఏంటంటే... నాగ చైత‌న్య ప్ర‌స్తుతం 'వెంకీ మామ' చేస్తున్నారు. అలాగే.. శేఖ‌ర్ క‌మ్ముల ద‌ర్శ‌క‌త్వంలో ఓ విభిన్న ప్రేమ‌క‌థా చిత్రంలో కూడా న‌టిస్తున్నాడు. ఇటీవ‌లే ఈ సినిమా కూడా ప్రారంభమైంది. ఈ మూవీ త‌ర్వాత‌ దిల్ రాజు బ్యాన‌ర్ లో సినిమా చేయాలి. ఇలా.. వ‌రుస సినిమాల‌తో బిజీగా ఉన్న కార‌ణంగా బంగార్రాజులో న‌టించ‌లేను అని చెప్పేశాడ‌ట నాగ చైత‌న్య‌. మ‌రి... ఇదే క‌నుక నిజ‌మైతే... నాగ చైత‌న్య చేయాల్సిన పాత్ర‌ను ఎవ‌రు చేస్తారో చూడాలి మ‌రి.

Next Story
Share it