'వైల్డ్ డాగ్' షూటింగ్‌లో నాగార్జున.. వీడియో వైర‌ల్‌

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  24 Oct 2020 12:29 PM GMT
వైల్డ్ డాగ్ షూటింగ్‌లో నాగార్జున.. వీడియో వైర‌ల్‌

కింగ్ నాగార్జున ప్ర‌స్తుతం హిమాల‌యాల్లో ఉన్నారు. అక్క‌డ ఆయ‌న‌కు ఏం ప‌ని అని అన‌కండి. త‌న కొత్త చిత్రం 'వైల్డ్ డాగ్' షూటింగ్ కోసం నాగార్జున అక్క‌డ‌కు వెళ్లారు. అహిషోర్ సాల్మన్ డైరెక్ట్ చేస్తోన్న ఈ సినిమా తాజా షెడ్యూల్ హిమాలయాల్లో మొదలైంది. మ్యాట్నీ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై నిరంజన్‌ రెడ్డి, అన్వేష్‌ రెడ్డి నిర్మిస్తున్నారు. దియా మిర్జా, సయామీ ఖేర్‌ హీరోయిన్లుగా నటిస్తున్నారు. యథార్థ ఘటనల ఆధారంగా రూపొందుతోన్న ఈ చిత్రంలో ఏసీపీ విజయ్ వర్మగా నాగార్జున న‌టిస్తున్నారు.తాజాగా రోహ్‌తంగ్ పాస్‌లో తీసిన వీడియోను నాగార్జున ట్విట్టర్‌లో షేర్ చేశారు. సముద్ర మట్టానికి 3980 మీటర్ల ఎత్తులో తాము ఉన్నామని, ఇది చాలా డేంజరస్ ప్రాంతమని నాగ్ తెలిపారు. నవంబర్ నుంచి మే వరకు ఆ ప్రదేశాన్ని మూసేస్తారని, ‘వైల్డ్ డాగ్’ షూటింగ్ ఇక్కడ ప్రస్తుతం చాలా బాగా జరుగుతోందని తెలిపారు. ఏడు నెలల తర్వాత షూటింగుకు ఇలాంటి అద్భుతమైన ప్లేస్‌కు రావడం చాలా ఆనందంగా ఉందని, 21 రోజుల్లో షూటింగ్ పూర్తి చేసుకుని తిరిగి వచ్చేస్తామని పేర్కొన్నారు.

తెలుగు రియాలిటీ షో బిగ్‌బాస్‌-4కి నాగార్జున హోస్ట్‌గా వ్య‌వ‌హరిస్తున్న సంగ‌తి తెలిసిందే. ప్ర‌స్తుతం నాగార్జున హిమాలయాల్లో ఉండ‌డంతో ఈ వారాంతంలో బిగ్‌బాస్‌-4 వీకెండ్‌లో ఎవ‌రు హోస్ట్‌గా వస్తారో వేచి చూడాల్సిందే. గత రెండు వారాలుగా గెస్ట్ హోస్ట్ రానున్నార‌ని వార్త‌లు వినిపించ‌గా.. అవ‌న్నీ పుకార్లేన‌ని తేలిపోయాయి. ప్ర‌స్తుతం మ‌న్మ‌థుడు హిమాలయాల్లో ఈ నెల చివ‌రి వ‌ర‌కు ఉంటాన‌ని చెప్ప‌డంతో.. గెస్ట్ హోస్ట్ వచ్చే అవ‌కాశం ఎక్కువ‌గా ఉంద‌నే టాక్ వినిపిస్తోంది.

Next Story