ఇంటికి బయలుదేరాను.. చాలా బాధగా ఉంది : నాగార్జున

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  6 Nov 2020 5:01 AM GMT
ఇంటికి బయలుదేరాను.. చాలా బాధగా ఉంది : నాగార్జున

‘వైల్డ్‌డాగ్‌’ చిత్ర షూటింగ్‌లో పాల్గొన‌డం కోసం నాగార్జున‌ బిగ్‌బాస్ షో నుండి త‌ప్పుకుని హిమాల‌యాస్‌కు వెళ్లిన సంగ‌తి తెలిసిందే. హిమాల‌యాల‌కు వెళ్లిన‌ప్ప‌టి నుండి ఆయ‌న సోష‌ల్ మీడియా వేదిక‌గా అక్క‌డి విశేషాల‌ను షేర్ చేసుకుంటూనే ఉన్నారు. తాజాగా మ‌రో విష‌యాన్ని త‌న అభిమానుల‌తో పంచుకున్నారు నాగార్జున‌. ఈ చిత్రంలో నాగార్జున‌ ఎసీపీ విజయ్‌ వర్మగా టైటిల్‌ రోల్‌లో నటిస్తున్న సంగ‌తి తెలిసిందే.



ఈ చిత్రం తాజా షెడ్యూల్‌ హిమాలయాస్‌లో జరగ‌డంతో.. సినిమాలో త‌న‌ పార్ట్‌ చిత్రీకరణ పూర్తయ్యిందంటూ.. ఆయ‌న‌ సోష‌ల్ మీడియాలో‌ ద్వారా తెలియజేశారు. నాగార్జున ట్వీట్ ప్ర‌కారం.. వైల్డ్‌డాగ్‌లో నా పాత్ర చిత్రీకరణ ఈరోజుతో పూర్తయ్యింది. ఇంటికి బయలుదేరాను. నా టాలెంటెడ్‌ టీమ్‌కు, హిమాలయాస్‌కు గుడ్‌బై చెబుతున్నందుకు చాలా బాధగా ఉంది"అని ట్వీట్‌తో పాటు కొన్ని ఫొటోలను నాగార్జున షేర్‌ చేశారు.

ఇదిలావుంటే.. ఈ సినిమాలో నాగార్జున‌కు జంట‌గా దియామీర్జా నటిస్తున్నారు. మ‌రో కీలక పాత్రలో బాలీవుడ్ బ్యూటీ సయామీ ఖేర్‌ నటిస్తున్నారు. నూతన దర్శకుడు అహిషోర్‌ సాల్మన్‌ దర్శకత్వంలో మ్యాట్నీ ఎంటర్‌టైన్‌మెంట్‌ బ్యానర్‌పై నిరంజన్‌రెడ్డి, అన్వేష్‌రెడ్డి సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

Next Story