'విశ్వాసం లేని నా కుక్క'.. వీడియో షేర్‌ చేసిన మెగా బ్రదర్‌

By తోట‌ వంశీ కుమార్‌  Published on  5 Aug 2020 12:21 PM GMT
విశ్వాసం లేని నా కుక్క.. వీడియో షేర్‌ చేసిన మెగా బ్రదర్‌

మెగా బ్రదర్‌ నాగబాబు సోషల్ మీడియాలో ఎంత యాక్టివ్‌గా ఉంటారో అందరికి తెలిసిందే. దాదాపుగా ప్రతి అంశంపై స్పందిస్తుంటారు. 'మన ఛానల్‌ మన ఇష్టం' యూ ట్యూబ్‌ ఛానల్ లో రక రకాల వీడియోలతో అందరిని అలరిస్తున్నాడు నాగబాబు. తాజాగా నాగబాబు ఓ వీడియోను పోస్టు చేశాడు. ఆ వీడియోకు 'విశ్వాసం లేని కుక్క' అంటూ టైటిల్ పెట్టారు. దీంతో నాగబాబు ఎవరినో టార్గెట్‌ చేశారని అంతా బావించారు. అయితే.. దానికి భిన్నంగా ఫన్నీ వీడియోను షేర్‌ చేశారు.

తన పెంపుడు కుక్కపై ఎంతో నమ్మకం పెట్టుకున్నారు నాగబాబు. అయితే.. అది దాన్ని వమ్ము చేసి తన దారిన తను పోయిందని చెప్పుకొచ్చారు. ఆ వీడియోలో ఏం ఉందంటే.. అసలు విషయానికి వస్తే 2006 నుంచి ఓ కుక్కను పెంచుకుంటున్నానని దానికి పీకూ అని పేరు పెట్టుకున్నానని చెప్పారు. కాగా.. ఇది ఎవరైనా తనపైకి వస్తే, వారి మీద భీకరంగా దాడి చేస్తానన్నట్టుగా ఇంతకాలం కలరింగ్ ఇచ్చేదని కానీ ఇటీవల జరిగిన ఓ ఘటనతో నా అభిప్రాయాన్ని మార్చుకున్నానని తెలిపాడు.

తన భార్య పద్మకు పాములంటే భయమని, ఆ భయాన్ని తొలగించేందుకు ఓ రబ్బర్ పామును తెచ్చి చూపిస్తున్న వేళ జరిగిన ఘటన ఇదని, దీని తీరువాత శునకాలు విశ్వాసాన్ని చూపిస్తాయన్న తన అభిప్రాయాన్ని మార్చుకోవాల్సి వచ్చిందని తెలిపాడు నాగబాబు. మొన్న ఆవిడకు పాములంటే భయం అనడంతో.. ఆ భయం పోగొట్టడానికి రబ్బరు పాములు తీసుకువచ్చి.. తనతో పట్టించా అని చెప్తూ ఆ పాముని చూడగానే నాగబాబు భార్య పద్మతో పాటు ఆ కుక్క కూడా లోపలికి పారిపోయే క్లిప్పింగ్ చూపించాడు.

ఇన్నాళ్లు నా కుక్క నా కోసం పోరాటం చేస్తుంది అనుకున్నా.. కానీ అది నా ప్రాణాల గురించి పట్టించుకోకుండా నా జీవితం నాకు ముఖ్యం అనుకుంది. మా పీకూకి కూడా మనిషి లక్షణాలు వచ్చాయి. విశ్యాసం లేని నా కుక్క అంటూ సరదాగా ఆ వీడియోను షేర్ చేశాడు.

Next Story