నాథూరాం గాడ్సే నిజమైన దేశ భక్తుడు.. నాగబాబు వివాదాస్పద ట్వీట్
By తోట వంశీ కుమార్ Published on 19 May 2020 7:27 PM ISTమెగా బ్రదర్ నాగబాబు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల తరువాత రాజకీయ కార్యక్రమాలకు దూరంగా ఉన్న ఏదో ఓ విషయంపై తరచూ తన సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ.. తన అభిప్రాయాలను వెల్లడిస్తుంటాడు. నాధురాం గాడ్సే నిజమైన దేశభక్తుడు అంటూ సంచలన ట్వీట్ చేశారు. నాగబాబు ట్వీట్‌పై సోషల్ మీడియా వేదికగా నెటీజన్లు ఆగ్రహాం వ్యక్తం చేస్తున్నారు.
‘ఈ రోజు నాథురాం గాడ్సే పుట్టిన రోజు. నిజమైన దేశ భక్తుడు. గాంధీని చంపడం కరెక్టా కదా అనేది చర్చనీయాంశం. కానీ అతని వైపు వాదనలను ఆ రోజుల్లో ఏ మీడియా కూడా చెప్పలేదు. కేవలం మీడియా అధికార ప్రభుత్వానికి లోబడి మాత్రమే పనిచేసింది. (ఈ రోజుల్లో కూడా చాలా వరకు ఇంతే). గాంధీని చంపితే ఆపఖ్యాతి పాలవుతానని తెలిసినా తాను అనుకున్నది చేశాడు. నాథురాం దేశభక్తిని శంకించలేము. ఆయన ఒక నిజమైన దేశభక్తుడు. ఆయన పుట్టిన రోజు సందర్భంగా ఆయనని ఒకసారి గుర్తుచేసుకోవలనిపించింది. పాపం నాథురాం గాడ్సే.. మే హిస్ సోల్ రెస్ట్ ఇన్ పీస్.’ అని ట్వీట్ చేశారు నాగబాబు.
ఈ ట్వీట్‌పై నెటీజన్లు మండిపడుతున్నారు. గాంధీని చంపిన వ్యక్తి దేశభక్తుడు ఎలా అవుతాడంటూ ప్రశ్నిస్తున్నారు. దేశ భక్తి ఉంటే చాలా మనిషిని ఎలా చంపుతాడు.. అదీ కూడా స్వాతంత్ర ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన వ్యక్తిని అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇంకా నయం నోట్ల మీద గాంధీ బొమ్మకు బదులు గాడ్సే బొమ్మ వేయాలి అని చెప్పలేదు చాలా సంతోషం అంటూ కొందరూ వ్యంగంగా కామెంట్లు చేస్తున్నారు.