విల్లు ఎక్కుపెట్టిన నాగశౌర్య

By తోట‌ వంశీ కుమార్‌  Published on  27 July 2020 5:31 AM GMT
విల్లు ఎక్కుపెట్టిన నాగశౌర్య

'అశ్వథ్థామ' సినిమాతో మంచి విజయం అందుకున్నాడు టాలీవుడ్‌ యంగ్‌ హీరో నాగశౌర్య. తాజాగా ఆయన సుబ్రహ్మణ్యపురం ఫేమ్ సంతోష్ జాగర్లపూడి దర్శకత్వంలో నటిస్తున్నాడు. శ్రీ వేంకటేశ్వర సినిమాస్ ఎల్ ఎల్ పి, నార్త్ స్టార్ ఎంటర్టైన్మెంట్ ప్రైవేట్ లిమిటెడ్ బ్యానర్స్ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నాయి. నాగ‌శౌర్య 20వ చిత్రంగా వ‌స్తోన్న ఈ మూవీ ప్రీ లుక్ ను ఇటీవల విడుదల చేసిన చిత్ర బృందం తాజాగా ఈ సినిమా ఫస్టు లుక్‌ను విడుదల చేసింది. స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ గా ఈ సినిమా తెరకెక్కుతోంది.

ఈ రోజు దర్శకుడు శేఖర్ కమ్ముల నాగశౌర్య సినిమా ఫస్ట్ లుక్ విడుదల చేసారు. అందులో 6 ప్యాక్ తో చొక్కా విప్పి విల్లు ఎక్కుపెట్టి చాలా సీరియస్ గా కనిపిస్తున్నాడు శౌర్య. ఫస్ట్ లుక్ చూస్తుంటే.. ఈ సినిమాలో నాగశౌర్య 'ఆర్చర్' గా కనిపించనునట్లు అర్ధమవుతుంది. ఈ సినిమాకు కాల భైరవ సంగీతం అందిస్తుండగా.. నాగశౌర్య సరసన కేతిక శర్మ నటిస్తోంది. ప్రస్తుతం ఈ ఫస్టులుక్‌ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.Next Story