ఈసారి కూతురి కోణం నుంచి.. 'నచ్చినోన్ని ప్రేమించడం తప్పా..?'
By తోట వంశీ కుమార్ Published on 10 Aug 2020 6:43 AM GMTనిత్యం వివాదాలతో సావాసం చేసే దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ. కరోనా కారణంగా సినిమా షూటింగ్‌లు ఆగిపోయినా కూడా వర్మ కంపెనీ మాత్రం వరుసగా సినిమాలు చేస్తుంది. తాజాగా ఆయన తెరకెక్కిస్తున్న చిత్రం ‘మర్డర్’. తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన ప్రణయ్ హత్య ఆదారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు వర్మ. దీనికి కుటుంబ కథా చిత్రమ్ అనే ట్యాగ్‌లైన్ పెట్టాడు. ఈ చిత్రంలో శ్రీకాంత్ అయ్యంగార్, సాహితి, గాయత్రి భార్గవి తదితరులు ముఖ్య పాత్రలు పోషించారు. నట్టీస్ ఎంటర్టైన్మెంట్, క్విటీ ఎంటర్టైన్మెంట్ పతాకాలపై అనురాగ్ కంచర్ల సమర్పణలో నట్టి కరుణ, నట్టి క్రాంతి నిర్మిస్తున్నారు.
ఇటీవల మర్డర్ చిత్ర ట్రైలర్, ఓ పాటని విడుదల చేసి సినిమాపై అంచనాలు పెంచిన వర్మ తాజాగా మరో పాటను విడుదల చేశారు. 'నచ్చినోన్ని ప్రేమించడం తప్పా..?'' అనే పాటను విడుదల చేశారు. ఇంతకముందు పిల్లల్ని ప్రేమించడం తప్పా..? అనే పాట తండ్రి కోణం నుంచి ఉండగా.. ప్రస్తుత పాట కూతురి కోణం నుంచి ఉంది. ఈ రెండు పాటలు కూడా ఒకే ట్యూన్, ట్రాక్‌లో ఉన్నాయి. దాదాపు రెండు గంటల వ్యవధి గల ఈ సినిమాను థియేటర్లలు ఓపెన్ చేసిన తర్వాత విడుదల చేస్తామని నిర్మాతలు వెల్లడించారు. ఇక ఈ చిత్ర విడుదలను ఆపాలంటూ అమృత ఇప్పటికే కేర్టులో కేసు వేసిన సంగతి తెలిసిందే. దీనికి సంబంధించి ఇంకా కోర్టు తీర్పు వెలువరించలేదు.