ముత్తూట్‌ ఫైనాన్స్ ఆఫీస్‌లో 77 కేజీల బంగారం చోరీ..!

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  25 Dec 2019 5:08 AM GMT
ముత్తూట్‌ ఫైనాన్స్ ఆఫీస్‌లో 77 కేజీల బంగారం చోరీ..!

క‌ర్ణాట‌క రాష్ట్ర రాజ‌ధాని బెంగళూరులో భారీ చోరీ చోటుచేసుకుంది. దొంగలు ఏకంగా 77 కేజీల బంగారాన్ని ఎత్తుకెళ్లారు. న‌గ‌రంలోని పులకేశినగర్‌ పోలీసుస్టేషన్ స‌మీపంలోని బాణసవాడి–హెణ్ణూరు రోడ్‌ లింగరాజపురం బ్రిడ్జి దగ్గరి ముత్తూట్‌ ఫైనాన్స్‌ కార్యాలయంలో ఈ చోరి జ‌రిగింది. ఈ ముత్తూట్ ఆఫీస్ కు భారీగా వినియోగ‌దారుల తాకిడి ఉంటుంది.

దీంతో ఈ ఆఫీస్‌లో భారీగా బంగారం ఉంటుందని భావించిన దొంగ‌లు శనివారం రాత్రి గోడకు రంధ్రం చేసి లోపలికి చొరబడ్డారు. బీరువాలను గ్యాస్‌ కట్టర్‌లతో కత్తిరించి లోప‌ల ఉన్న‌ 77 కేజీల బంగారు ఆభరణాలను దోచుకెళ్లారు. దొంగ‌లు పోలీసులకు ఆధారాలు దొరక్కుండా ఉండేందుకు ముందుగా సీసీ కెమెరాలను తొలగించారు. పోలీసులు కేసు నమోదు చేసి ప్రత్యేక బృందంతో దర్యాప్తు మొద‌లుపెట్టారు.

Next Story
Share it