గ‌త కొన్నేళ్లుగా క్యాన్స‌ర్‌తో పోరాడుతున్న అండ‌ర్ వ‌ర‌ల్డ్ డాన్ ముత‌ప్ప రాయ్(68) క‌న్నుమూశారు. ఈ రోజు ఉద‌యం బెంగళూరులో మృతిచెందారు. ధ‌నిక‌‌ కుటుంబానికి చెందిన ముత‌ప్ప‌రాయ్.. ఉన్న‌త‌ విద్యావంతుడు. కామర్స్‌లో గ్రాడ్యుయేట్ పూర్తిచేసిన‌ ముత‌ప్పరాయ్‌.. విజయ బ్యాంక్‌లో ఉద్యోగిగా విధులు నిర్వ‌ర్తించాడు.

M1
1980 సంవ‌త్స‌రంలో బెంగళూరు అండర్ వరల్డ్‌తో జ‌త‌క‌ట్టిన రాయ్‌.. దాదాపు 30 ఏళ్లు బెంగుళూరు అండ‌ర్ వ‌ర‌ల్డ్ సామ్రాజ్యాన్ని ఏలారు. ముతప్ప రాయ్ రియ‌ల్ ఎస్టేట్ సెటిల్ మెంట్లు, దందాలు చేస్తూ అన‌తికాలంలోనే ఎదిగాడు. అప్ప‌ట్లో ఓ కేసు విష‌యంలో కోర్టుకు హాజ‌ర‌యిన ముత‌ప్ప రాయ్‌పై కాల్పులు జ‌రిగాయి. రెండేళ్లు మంచంపైనే ఉన్న ఆయ‌న‌.. కోలుకున్న‌ అనంత‌రం దుబాయ్ పారిపోయాడు. అక్క‌డి నుండే ఆప‌రేష‌న్లు చేసేవాడు. క‌ర్ణాట‌క పోలీసులు నిఘా పెట్ట‌డంతో.. దుబాయ్ నుండి ఆఫ్రికాకు మ‌కాం మార్చాడు. అక్క‌డ ఫార్మా కంపెనీలు కూడా స్థాపించాడ‌ట‌. కొద్ది కాలానికి క్యాన్సర్ బారిన పడటంతో మాఫీయా నుంచి రిటైర్ అయ్యారు.

M2
2002లో బెంగుళూరులో అరెస్ట‌యిన రాయ్‌.. విడుద‌ల అయ్యాక‌ జయ కర్ణాటక అనే సంస్థను స్థాపించి యువ‌త‌కు మార్గ‌నిర్ధేశం చేస్తున్నాడు‌. ఎన్నో క్రిమిన‌ల్ కేసులలో ఉన్న రాయ్‌.. యువ‌త‌ను అవినీతికి పాల్ప‌డొద్దు అంటూ సందేశాలు ఇచ్చేవారట‌. ప్ర‌స్తుతం మైసూరు రోడ్డులోని బీదాదిలో నివ‌సిస్తున్న రాయ్‌కు.. ఆయనకు భార్య, పిల్లలు ఉన్నారు. రాయ్ అంత్యక్రియ‌లు అతని నివాస స్థలంలో జ‌రుప‌నున్న‌ట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. క‌రోనా వైర‌స్ వ్యాప్తి కార‌ణంగా అంత్య‌క్రి‌యల్లో పాల్గొన‌డానికి ప్ర‌జ‌లు ఎవ‌రినీ అనుమ‌తించ‌డం లేదు. ఇదిలావుంటే.. ముత‌ప్ప రాయ్ జీవిత చ‌రిత్ర‌ను సినిమాగా తీయ‌నున్న‌ట్లు వివాద‌స్ప‌ద ద‌ర్శ‌కుడు రామ్ గోపాల్ వ‌ర్మ గ‌తంలో ప్ర‌క‌ట‌న కూడా చేశారు. అయితే.. అది కార్య‌రూపం దాల్చ‌లేదు.

న్యూస్‌మీటర్ తెలుగు

విశ్వసనీయమైన డిజిటల్ మీడియా ప్లాట్‌ఫారమ్ మీకు విశ్వసనీయ వార్తా కథనాలను మరియు ప్రస్తుత వ్యవహారాల విశ్లేషణను తెస్తుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *