Fact Check : ఆవ నూనె వాడడం ద్వారా కరోనాను తరిమేయొచ్చా..?

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  1 May 2020 6:05 AM GMT
Fact Check : ఆవ నూనె వాడడం ద్వారా కరోనాను తరిమేయొచ్చా..?

యోగ గురు బాబా రామ్ దేవ్ ఏప్రిల్ 25న మాట్లాడుతూ.. ఆవ నూనెను నాసికా రంధ్రములకు పూయడం వలన కరోనా వైరస్ అన్నది డైరెక్ట్ గా కడుపు లోకి వెళ్తుందని.. అలా కడుపులోకి వెళ్లిన కరోనా వైరస్ లోపల ఉన్న ద్రావణాల కారణంగా చనిపోబడుతుందని అన్నారు. e-Agenda Aaj Tak సంస్థతో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు.

బాబా రామ్ దేవ్ మాట్లాడుతూ ఎవరైతే ఒక నిమిషం కంటే ఎక్కువ సమయం ఊపిరి బిగబట్టి ఉండగలరో.. వాళ్లలో కరోనా లక్షణాలు ఉండవు అని తెలిపారు. దీన్ని కోవిద్-19 సెల్ఫ్ టెస్ట్ అని అన్నారు రామ్ దేవ్. ఎవరికైతే క్రోనిక్ హైపర్ టెన్షన్, హృద్రోగాలు, డయాబెటిస్, వయోవృద్ధులు 30 సెకండ్లు ఊపిరి బిగబట్టి ఉండగలిగినా.. వయసులో ఉన్న వాళ్ళు ఒక నిమిషం పాటూ ఉండగలిగిన వారిలో కరోనా లేనట్లేనని అన్నారు. కరోనా లక్షణాలు ఉన్న కేసులకూ, లేని వాటికీ ఈ టెక్నిక్ వర్తిస్తుందని చెప్పారు.

కరోనా కోసం ఓ ప్రత్యేక ప్రాణాయామం ఉందని, దానినే ఉజ్జయి అని పిలుస్తారన్నారు. దీంట్లో భాగంగా గొంతు నుంచి గాలిని సంకోచించి, ఆపై శబ్దంతో దానిని పంప్ చేసి.. కొద్దిసేపు హోల్డ్ చేసి ఉంచి క్రమంగా వదిలేయాలి. ఇది కరోనాకు సెల్ఫ్ టెస్టింగ్ లాంటిదేనని ఆయన అన్నారు. అలా ఉండగలిగితే రోగ లక్షణాలు ఉన్నా లేకపోయినా కరోనా లేనట్లేనని తెలిపారు.

రామ్ దేవ్ బాబా చేసిన వ్యాఖ్యలను పలు ప్రముఖ వార్తా సంస్థలు ప్రచురించాయి. ఇండియా టుడేకు సంబంధించిన పేపర్ క్లిప్పింగ్ కూడా ట్విట్టర్, వాట్సప్ లలో వైరల్ అవుతోంది.

2

3

4

నిజమెంత:

రామ్ దేవ్ బాబా చేసిన వ్యాఖ్యలపై కొందరు నిపుణులతో న్యూస్ మీటర్ చర్చించింది.

సెంటర్ ఫార్ సెల్యులర్ అండ్ మాలిక్యులర్ బయోలజీ(సిసిఎంబి) డైరెక్టర్ రాకేష్ మిశ్రా మాట్లాడుతూ రామ్ దేవ్ బాబా వ్యాఖ్యలను తప్పుబట్టారు. 'ఆయన చెప్పిన చిట్కాలకు సంబంధించి వైద్య పరంగా ఎటువంటి ఆధారాలు లేవని. ముక్కు రంధ్రాల దగ్గర ఆయిల్ ను పూసుకోవడం అది కాస్తా కరోనా వైరస్ ను చంపుతుందని.. లేదంటే వైరస్ కు.. మన శరీరానికి మధ్య అడ్డు గోడగా ఆయిల్ పని చేస్తుందని అనుకోవడం తప్పని అన్నారు. అలాగే కడుపులో ఉన్న ద్రవాలు కరోనా వైరస్ ను చంపుతాయని అనుకోడానికి కూడా ఎటువంటి సాక్ష్యాలు లేవని అన్నారు.

కరోనా వైరస్ తో పోరాడడానికి ఉన్నది రెండే రెండు మార్గాలని.. 'ఒకటి కరోనా వైరస్ తో పోరాడే మందులను వాడడం లేదా రోగ నిరోధక శక్తిని బాగా పెంపొందించుకోవడం' అని అన్నారు.

రామ్ దేవ్ బాబా చెప్పిన సెల్ఫ్ టెస్ట్ గురించి అపోలో ఆసుపత్రికి చెందిన డాక్టర్ సునీత నర్రెడ్డి మాట్లాడుతూ.. మన దేశంలో ఉన్న కరోనా రోగులలో చాలా మందిలో వైరస్ లక్షణాలు కనిపించడం లేదు. కరోనా వైరస్ శరీరంపై ప్రభావం చూపనంత వరకూ కూడా హాయిగా శ్వాస పీల్చవచ్చు. గాలి పీల్చుకోకపోవడం అన్న టెస్టు ఒక్కో వ్యక్తిపై ఒక్కో ప్రభావం చూపుతుంది. కొందరిలో కోవిద్-19 లక్షణాలు లేకపోయినా.. ఊపిరితిత్తుల సమస్య కారణంగా సరిగా శ్వాస తీసుకోవడంలో సమస్యలు తలెత్తవచ్చు' అని అన్నారు.

రామ్ దేవ్ బాబా చెప్పిన టెస్టులకు సంబంధించి ఏ మెడికల్ జర్నల్ లోనూ పొందుపర్చలేదు.

యోగ గురు బాబా రామ్ దేవ్ ఏప్రిల్ 25న మాట్లాడుతూ ఆవ నూనెను నాసికా రంధ్రములకు పూయడం వలన కరోనా వైరస్ అన్నది డైరెక్ట్ గా కడుపు లోకి వెళ్తుందని.. అలా కడుపులోకి వెళ్లిన కరోనా వైరస్ లోపల ఉన్న ద్రావణాల కారణంగా చనిపోబడుతుందని 'పచ్చి అబద్ధం'

ఒక నిమిషం పాటూ శ్వాస తీసుకోవడం ఆపడం అన్న టెస్టు ద్వారా కోవిద్-19 మీలో లేదు అని నిర్ధారించుకోవచ్చు అన్నది కూడా 'అబద్ధమే'

Claim Review:Fact Check : ఆవ నూనె వాడడం ద్వారా కరోనాను తరిమేయొచ్చా..?
Claim Fact Check:false
Next Story