టీఎంసీ, క్యూసెక్కు, ప్రమాద హెచ్చరిక.. ఈ ప‌దాల‌కు అర్థం తెలుసా.?

What is the meaning of TMC, Cusec and Danger warning. దేశ వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. దీంతో నదులు, వాగులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. రిజర్వాయర్లు,

By అంజి  Published on  15 July 2022 10:49 AM GMT
టీఎంసీ, క్యూసెక్కు, ప్రమాద హెచ్చరిక.. ఈ ప‌దాల‌కు అర్థం తెలుసా.?

దేశ వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. దీంతో నదులు, వాగులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. రిజర్వాయర్లు, ప్రాజెక్టులు జలకళను సంతరించుకున్నాయి. కొన్ని ప్రాజెక్టులకు భారీ వరద పోటెత్తుతోంది. మరికొన్ని చోట్లు నదులు ఉగ్రరూపంగా ప్రవహిస్తున్నాయి. ప్రాజెక్టులకు భారీ వరద వచ్చినప్పుడు టీఎంసీ, క్యూసెక్కు అనే పదాలను సాధారణంగా వాడుతుంటారు. అలానే నదులు ఉప్పొంగి ప్రవహిస్తున్నప్పుడు ప్రమాద హెచ్చరికలు జారీ చేస్తారు. వాటిలో ఫస్ట్‌ వార్నింగ్‌, సెకండ్‌, వార్నింగ్‌, థర్డ్‌ వార్నింగ్‌ అని ఉంటాయి. మరీ ఈ టీఎంసీ, క్యూసెక్కు, ప్రమాద హెచ్చరికలు అంటే ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..

టీఎంసీ

ప్రాజెక్టులో నిల్వ ఉన్న నీటి పరిణామం చెప్పడానికి టీఎంసీ అనే ప్రమాణంను ఉపయోగిస్తారు. టీఎంసీ అంటే థౌజెండ్‌ మిలియన్ క్యూబిక్‌ అని అర్థం. తెలుగులో వందకోట్ల ఘనపుటడులు అని అర్థం. ఒక టీఎంసీ అంటే 2,80,00,000 క్యూబిక్ మీటర్లు. నీటి నిల్వ గురించి మాట్లాడినప్పుడు 'టీఎంసీ' అనే పదాన్ని వాడుతారు.

క్యూసెక్కు

నీటి ఇన్‌ఫ్లో, అవుట్‌ఫ్లో గురించి మాట్లాడినప్పుడు 'క్యూసెక్కు' అనే పదాన్ని వాడుతారు. క్యూసెక్కు అంటే సెక‌ను కాలంలో ప్ర‌వ‌హించే ఘ‌న‌పుట‌డుగుల నీరు అని అర్థం. క్యూబిట్‌ ఫీట్‌ పర్‌ సెకండ్‌ అని అర్థం. ఒక సెక‌ను వ్య‌వ‌ధిలో ఘ‌న‌పుట‌డుగుల నుంచి ప్ర‌వ‌హించే నీరు 28 లీట‌ర్లు. ఏదైనా ఒక ప్రాజెక్టు నుంచి కాలువ ద్వారా 11 వేల క్యూసెక్కుల నీరు 24 గంట‌ల పాటు ప్ర‌వ‌హిస్తే ఒక టీఎంసీ నీరు వెళ్లిపోతోంది.

ప్రమాద హెచ్చరిక

నదుల్లో భారీ వరద ప్రవహిస్తున్నప్పుడు ప్రమాద హెచ్చరికలు జారీ చేస్తారు. ప్రవాహాన్ని ఆధారంగా చేసుకుని.. ప్రమాద హెచ్చరికలు ఇస్తారు. అవి ఫాలో అయి.. లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా వ్యవహరించాల్సి ఉంటుంది.

హెచ్చరికలు.. పాటించాల్సిన జాగ్రత్తలు

మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేస్తే.. నదిలో బోటు ప్రయాణాలపై ఆంక్షలు ఉంటాయి. చేపల వేటకు మత్స్యకారులు వెళ్లొద్దు. రాకపోకలకు కూడా అవకాశం లేదు.

రెండో ప్రమాద హెచ్చరిక జారీ చేస్తే.. అధికారులు అప్రమత్తంగా ఉండాలి. ఎలాంటి ఘటనలు జరగకుండా చూసుకునేందుకు.. అలర్ట్ గా ఉండి, ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తుండాలి. ఒకవేళ గట్లు బలహీనంగా ఉన్నాయనుకుంటే అవసరమైన చర్యలు తీసుకుంటారు. ఇసుక బస్తాలతో రక్షణ ఏర్పాట్లు చేస్తారు.

మూడో ప్రమాద హెచ్చరిక జారీ చేస్తే.. ఇంకా చాలా జాగ్రత్తగా ఉండాలి. అధికారులు వరద నిర్వహణ పనుల్లో వెళ్తారు. సిబ్బందికి సెలవులు కూడా రద్దవుతాయి. అన్ని వేళలా ఇరిగేషన్ సిబ్బంది అందుబాటులో ఉంటారు. కలెక్టర్లు ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేస్తూ ఉంటారు.

Next Story