నూతన వధూవరులు.. ప్రాణ దాతలు అయ్యారు
UP couple donates blood on wedding day. రక్తదానం చేయండి.. ప్రాణ దాతలు అవండి.. నూతన వధూవరులు.. ప్రాణ దాతలు అయ్యారు
By Medi Samrat Published on 23 Feb 2021 7:51 PM ISTमेरा भारत महान |
— Ashish Kr Mishra (@IndianCopAshish) February 22, 2021
एक बच्ची को ब्लड की जरूरत थी,कोई भी रक्तदान करने को सामने नही आ रहा था, क्योंकि वो किसी दूसरे की बच्ची थी,अपनी होती तो शायद कर भी देते,
खैर, शादी के दिन ही इस जोड़े ने रक्तदान कर बच्ची की जान बचायी |
Jai Hind,#PoliceMitra #UpPoliceMitra #BloodDonation pic.twitter.com/tXctaRe1nR
ఈ విషయాన్ని ఉత్తర్‌ప్రదేశ్ పోలీస్ ఆశీష్ మిశ్రా ట్విటర్ ద్వారా పంచుకున్నారు. ఈ జంటను ప్రశంసిస్తూ మిశ్రా నవదంపతుల ఫొటోను షేర్ చేశారు. ఈ ఫొటోలో వరుడు రక్తం దానం చేస్తుండగా అతని భార్య అతని పక్కన నిలబడి ఉంది. దీనికి సంబంధించిన ఫొటో సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది.
ఓ యువతి ప్రాణాపాయస్థితిలో ఉండగా ఆమెకు రక్తదానం చేయడానికి ఎవరూ ముందుకు రాలేదు. ఈ విషయం తెలియగానే కొత్త దంపతులు పెళ్లి దుస్తుల్లోనే ఆస్పత్రికి వచ్చి సహాయం చేశారు. ఆపదలో ఉన్న యువతి కోసం రక్తదానం చేసి మానవత్వం చాటుకున్న వధూవరులను నెటిజన్లు ప్రశంసిస్తున్నారు.