సనాతన ధర్మంపై వ్యాఖ్యలు.. బెంగళూరు కోర్టుకు ఉదయనిధి స్టాలిన్
తమిళనాడు యువజన సంక్షేమం, క్రీడల అభివృద్ధి శాఖ మంత్రి ఉదయనిధి స్టాలిన్ మంగళవారం నాడు ప్రత్యేక న్యాయస్థానం మెజిస్ట్రేట్‌కు హాజరయ్యారు.
By అంజి
సనాతన ధర్మంపై వ్యాఖ్యలు.. బెంగళూరు కోర్టుకు ఉదయనిధి స్టాలిన్
బెంగళూరు: తమిళనాడు యువజన సంక్షేమం, క్రీడల అభివృద్ధి శాఖ మంత్రి ఉదయనిధి స్టాలిన్ మంగళవారం నాడు ప్రత్యేక న్యాయస్థానం మెజిస్ట్రేట్‌కు హాజరయ్యారు. 'సనాతన ధర్మాన్ని నిర్మూలించండి' అంటూ చేసిన వ్యాఖ్యలపై తమిళనాడు మంత్రి ఉదయనిధి స్టాలిన్‌కు కోర్టు మంగళవారం బెయిల్ మంజూరు చేసింది. డిఎంకె నాయకుడు తన వ్యాఖ్య కోసం సామాజిక కార్యకర్త పరమేష్ చేసిన పిటిషన్ ఆధారంగా అతనికి నోటీసు ఇచ్చిన తరువాత 42వ అదనపు చీఫ్ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ ముందు హాజరయ్యారు. క్రీడలు, యువజన వ్యవహారాల శాఖను కలిగి ఉన్న ఉదయనిధి స్టాలిన్ లక్ష రూపాయల పూచీకత్తుతో బెయిల్ పొందారు. కేసు విచారణను ఆగస్టు 8కి వాయిదా వేసింది. ఉదయనిధి తమిళనాడు ముఖ్యమంత్రి, అధికార డీఎంకే అధినేత ఎంకే స్టాలిన్ కుమారుడు.
సనాతన ధర్మాన్ని కించపరిచే వ్యాఖ్యలకు సంబంధించి సామాజిక కార్యకర్త వి పరమేశ చేసిన ఫిర్యాదు ఆధారంగా ఉదయనిధి స్టాలిన్‌ను కోర్టు ముందు హాజరుకావాలని ఆదేశించింది. ఉదయనిధి స్టాలిన్ చేసిన వ్యాఖ్యలు తనను, తన మతాన్ని, హిందూ మతానికి చెందిన వ్యక్తులను కించపరిచేలా ఉన్నాయని ఫిర్యాదుదారు పేర్కొన్నారు. ఐపీసీ సెక్షన్లు 153 (అభ్యంతరంగా రెచ్చగొట్టడం, అల్లర్లు సృష్టించే ఉద్దేశ్యంతో) 298 (మతపరమైన భావాలను గాయపరిచే ఉద్దేశ్యంతో పదాలు చెప్పడం), 500 (పరువు నష్టం) కింద ఉదయని స్టాలిన్ వ్యాఖ్యలను కోర్టు పరిగణలోకి తీసుకుంది. సెప్టెంబరు 2023లో జరిగిన ఒక సదస్సులో ఉదయనిధి స్టాలిన్ మాట్లాడుతూ.. సనాతన ధర్మం సామాజిక న్యాయం, సమానత్వానికి విరుద్ధమని, దానిని నిర్మూలించాలని అన్నారు. ఈ ప్రకటన జాతీయ స్థాయిలో దుమారం రేపింది.