కరోనాపై సుధీర్ఘ సమీక్ష నిర్వహించిన మంత్రి ఈటల

Minister Eatela Review Meeting On Corona. ట్రేసింగ్ కోసం కొత్త ఆప్ : ట్రేసింగ్- టెస్టింగ్- ట్రేసింగ్- ట్రీటింగ్ విధానంలో కరోనా కట్టడికి

By Medi Samrat  Published on  3 April 2021 7:11 PM IST
కరోనాపై సుధీర్ఘ సమీక్ష నిర్వహించిన మంత్రి ఈటల

కరోనా సెకండ్‌ వేవ్‌పై అప్రమత్తమైనట్లు రాష్ట్ర వైద్యారోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్‌ తెలిపారు. కరోనా కేసుల పెరుగుదలపై డీఎంఈ రమేశ్‌రెడ్డి, ఆరోగ్యశాఖ కార్యదర్శి రిజ్వీ ఇతర అధికారులతో మంత్రి శనివారం సమీక్షా సమావేశం నిర్వహించారు.

ట్రేసింగ్ కోసం కొత్త ఆప్ :

ట్రేసింగ్- టెస్టింగ్- ట్రేసింగ్- ట్రీటింగ్ విధానంలో కరోనా కట్టడికి కొత్త ఆప్ రూపొందించిన వైద్య ఆరోగ్య శాఖ. PHC స్థాయి వరకు రాపిడ్ యాంటీ జెన్ టెస్ట్ లు చేస్తున్న నేపద్యంలో పాసిటివ్ వచ్చిన వ్యక్తుల కాంటాక్ట్ పర్సన్స్ కి వెంటనే మొబైలు ద్వారా SMS పంపించే విధంగా నూతన ఆప్ రూపకల్పన. దీని ద్వారా కాంటాక్ట్ పర్సన్స్ మొబైల్ కి వెంటనే కరోనా పరీక్ష చేయించుకోవాలని ఎస్ఎంఎస్ వెళ్తుంది. దీనివల్ల ట్రేసింగ్ అత్యంత తొందరగా చేయడానికి వీలవుతుంది. కరోనా లక్షణాలు ఉన్న వారందరూ నిర్లక్ష్యం చేయకుండా కరోనా నిర్ధారణ పరీక్షలు చేయించుకోవాలని ప్రజలకు మంత్రి విజ్ఞప్తి చేశారు.

అన్ని ఆసుపత్రులలో కరోనా చికిత్స :

గతంలో కరోనా చికిత్స అందించిన అన్ని ఆసుపత్రులు తిరిగి పూర్తి స్థాయిలో కరోనా అసుపత్రులగా మార్చాలని నిర్ణయం. 33 జిల్లా కేంద్రాలలోని హాస్పిటల్స్ లో కరోనా వార్డ్స్ ఏర్పాటు చేసి అక్కడే చికిత్స అందిచాలని నిర్ణయం. ఇక్కడ డాక్టర్లు, నర్సులు, స్యానిటరి సిబ్బంది, పేషంట్ కేర్ వర్కర్స్, మందులు,ఆక్సిజన్ సదుపాయం 24 గంటలు అందుబాటులో ఉండేలా చూడాలని మంత్రి ఆదేశాలు జారీ చేశారు.

ఈ సంవత్సర కాలంలో కరోనా అనేక అనుభవాలు అందించింది. మొదట్లో పేషంట్ దగ్గరికి పోవాలంటేనే భయం ఉండేది. కానీ ఇప్పుడు కేవల ఒక్క మాస్క్ మాత్రమే పెట్టుకొని పేషంట్ల దగ్గరికి డాక్టర్ లు, సిబ్బంది వెళ్తున్నారు. పేషంట్ల బందువులు కూడా దగ్గర ఉండి చూసుకుంటున్నారు. భయం పోయింది. కరోనా కు చంపే శక్తి లేదు. ఎవరయితే నిర్లక్ష్యం చేస్తారో, లక్షణాలు ఉన్నా పరీక్ష చేసుకోకుండా ఆలస్యం చేస్తారో, కరోనా నిర్ధారణ అయిన తరువాత కూడా సరైన చికిత్స తీసుకోరో వారికి ఇబ్బంది అవుతుంది కాబట్టి అప్రమత్తంగా ఉండాలని మంత్రి విజ్ఞప్తి చేశారు. ఎట్టి పరిస్థితుల్లో నిర్లక్ష్యం చేయవద్దు అని కోరారు.

22 హాస్పిటల్స్ లో లిక్విడ్ ఆక్సిజన్ టాంక్ ల ఏర్పాటు :

కరోనా చికిత్స లో ప్రధాన భూమిక పోషిస్తున్న ఆక్సిజన్ ను అన్ని ఆసుపత్రుల్లో ఏర్పాటు చేశామని మంత్రి తెలిపారు. 22 హాస్పిటల్స్ లో శాశ్వతంగా ఆక్సిజన్ కొరత లేకుండా లిక్విడ్ ఆక్సిజన్ టాంక్ లను ఏర్పాటు చేశారు. వెంటిలేటర్ మీద ఉన్న పేషంట్ కి ఆక్సిజన్ కొరతకి సంబందించి ఎలాంటి ఇబ్బందులు తలెత్తబోవని మంత్రి స్పష్టం చేశారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వరకు ఆక్సిజన్ సిలెండర్లను అందుబాటులో ఉంచామని తెలియజేశారు.

ఐషోలేషన్ సెంటర్ల ఏర్పాటు :

అన్ని జిల్లా కేంద్రాలలో మునుపటిలా ఐషోలేషన్ సెంటర్ల ఏర్పాటు చేయాలని నిర్ణయించామని మంత్రి తెలిపారు. పాజిటివ్ గా నిర్ధారణ అయిన వారికి ఇంట్లో ఉండే అవకాశం లేని వారందరికీ ఐషోలేషన్ సెంటర్ల లో ఉంచేదుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నాము. ఆయా కేంద్రాలలో 24 గంటలు డాక్టర్ లు, వైద్య సిబ్బంది అందుబాటులో ఉండి పేషంట్లను మానిటర్ చేస్తారు. వారికి అవసరం అయిన బోజనాలు, మంచినీరు అందజేస్తాము. అతి త్వరలో వీటిని సిద్దం చేస్తామని మంత్రి తెలియజేశారు. హైదరాబాద్ లో నేచర్ క్యూర్ హాస్పిటల్, ఆయుర్వేద హాస్పిటల్, నిజామియా టీబీ హాస్పిటల్, ఫీవర్ హాస్పిటల్, చెస్ట్ హాస్పిటల్ ను పూర్తి స్థాయిలో కరోనా చికిత్స, క్వారంటైన్ సెంటర్ లుగా మార్చాలని నిర్ణయం. మరో వారం రోజుల్లో ఇవన్నీ సిద్దం చేయాలని అధికారులని ఆదేశించిన మంత్రి.

కాల్ సెంటర్ పునరుద్దరణ :

హోమ్ ఐషోలేషన్ లో ఉండేవారికి సలహాలు సూచనలు ఇవ్వడానికి, వారి ఆరోగ్య పరిస్థితిని తెలుసుకోవడానికి SR నగర్ లో కాల్ సెంటర్ ను పూర్తి స్థాయిలో పని చేయనుంది. హోమ్ ఐషోలేషన్ లో ఉన్న వారాదరికి కరోనా మెడికల్ కిట్ అందించడంతో పాటు వారికి టెలిఫోన్ ద్వారా వైద్య సలహాలు అందించనున్నారు.

ప్రైవేట్ హాస్పిటల్స్ కి హెచ్చరిక :

వైద్యో నారాయణో హరి అంటారు. డాక్టర్ లను దేవుళ్లుగా చూస్తారు. కరోనా చికిత్సకు అతి తక్కువ ఖర్చు అవుతుంది అని మనకు ఉన్న అనుభవం చెప్తుంది. ఇలాంటి పరిస్థితుల్లో పేషంట్ల భయాన్ని సొమ్ము చేసుకోవద్దు అని మంత్రి ప్రైవేట్ హాస్పిటల్స్ వారిని కోరారు. ప్రజలకు మద్దతు ఇచ్చి, పేషంట్లకు నమ్మకాన్ని కలిగించాలని కోరారు. ప్రభుత్వం నిర్ధారించిన రేట్ల ప్రకారం వైద్యం అందించాలని కోరారు.

ముఖ్యమంత్రి గారు ఎప్పటికప్పుడు సమీక్ష :

కేసులు పెరుగుతున్న నేపధ్యం లో సిఎం కె చంద్రశేఖర్ రావు గారు ఎప్పటికప్పుడు సమీక్ష చేస్తూ తగిన సలహాలు సూచనలు అందిస్తున్నారు. వైద్య ఆరోగ్య శాఖ, పంచాయతీ రాజ్ శాఖ, మున్సిపల్ శాఖ, పోలీస్ శాఖలను సమన్వయం చేస్తున్నారు. చీఫ్ సెక్రటరీ నుండి కింద స్థాయి ఉద్యోగి వరకు అప్రమత్తంగా ఉండాలని ఆదేశాలు జారీ చేశారు.

మూడు G.O లు విడుదల :

కరోనా వైరస్ వ్యాప్తి ని అడ్డుకట్ట వేయడానికి ప్రభుత్వం ఇప్పటివరకు మూడు ప్రభుత్వ ఉత్తర్వులు జారీ చేసింది. జి. వో నంబర్ : 67,68,69 లు. 67 జీవో లో స్కూల్లు, హాస్టల్లు మూసివేయడం జరిగింది. 68 జీ వో ద్వారా మాస్క్ లు తప్పని సరి చేస్తూ ఉత్తర్వులు ఇవ్వడం జరిగింది. 69 జీవో ద్వారా పండుగలను కోవిడ్ నిభందనల మేరకు జరుపుకోవాలని ఉత్తర్వులు ఇవ్వడం జరిగింది.

108 వాహనాలు :

కరోనా పేషంట్లను తరలించేందుకు ప్రత్యేక 108 వాహనాలు కేటాయింపు. గ్రేటర్ హైదరాబాద్ లో 32.. 108 వాహనాలను కోవిడ్ పేషంట్లను తరలించడానికి ప్రత్యేకంగా కేటాయించడం జరిగింది. 108 కి ఫోన్ చేస్తే వారిని దగ్గరలో ఉన్న ఆసుపత్రికి తరలించేదుకు అన్ని ఏర్పాట్లు చేయడం జరిగిందని మంత్రి తెలిపారు. మందులు, పరికరాలు పూర్తి స్థాయిలో అందుబాటులో ఉన్నాయి.



Next Story