ఈ నిబంధనలను ఉల్లంఘిస్తే ఇక అంతే సంగతులు..!

Higher insurance premium on cards for vehicles violating traffic rules. మనదేశంలో రోడ్డు ప్రమాదాలను అరికట్టడానికి ఈ నిబంధనలను ఉల్లంఘిస్తే ఇక అంతే సంగతులు.

By Medi Samrat  Published on  20 Jan 2021 9:30 AM IST
traffic rules

మనదేశంలో రోడ్డు ప్రమాదాలను అరికట్టడానికి ఇప్పటికీ ఎన్నో ట్రాఫిక్ రూల్స్ ను తెచ్చారు. ఎన్ని నిబంధనలను విధిస్తున్నప్పటికీ నిబంధనలను ఏమాత్రం లెక్కచేయకుండా ట్రాఫిక్ నిబంధనలను అతిక్రమించడం తోపాటు ఇతను వాహనదారులకు ఎంతో ఇబ్బందికరంగా మారుతున్నారు. ఈ విధంగా ట్రాఫిక్ రూల్స్ అతిక్రమించే వారికి వేలకు వేలు చలానా విధించినప్పటికీ ఏమాత్రం మార్పు లేకుండా చేసిన తప్పులనే మళ్లీ మళ్లీ చేస్తూ ప్రాణాలను కూడా కోల్పోతున్నారు. అయితే ట్రాఫిక్ నిబంధనలలో భాగంగా మరికొన్ని చర్యలను అమలులోకి తీసుకురానున్నారు.

ఇప్పటి నుంచి ఎవరైతే ట్రాఫిక్ నిబంధనలను పాటించకుండా ఉల్లంఘిస్తూ ఇతర వాహనదారులకు ఇబ్బందికరంగా మారుతారు అలాంటి వారిపై భీమా రెగ్యులేటర్ ఐఆర్‌డిఎఐ కొత్త రూల్స్ తీసుకురాబోతుంది. అయితే ట్రాఫిక్ కు, ఇన్సూరెన్స్ కు సంబంధం ఏమిటనే సందేహం మీకు కలగొచ్చు. ఎవరైతే ట్రాఫిక్ నిబంధనలను ఒకసారి ఉల్లంఘిస్తున్నారో అలాంటి వారి వాహన బీమా కూడా పెరిగిపోతూ ఉంటుంది. ఈ కొత్త నిబంధనల ప్రకారం ట్రాఫిక్ రూల్స్ ను ఉల్లంఘించిన వారు ట్రాఫిక్ చలానా కడుతూ వెహికల్ బీమా ప్రీమియం కూడా అధికంగా చెల్లించాల్సి ఉంటుంది.

ఈ కొత్త ట్రాఫిక్ నిబంధనలకు సంబంధించిన నివేదికను ఇప్పటికే ఐఆర్‌డిఎఐ సిద్ధం చేసింది. ఈ కొత్త నిబంధనలను మొదటగా దేశ రాజధాని ఢిల్లీలో అమలు చేయనున్నట్లు తెలిపారు. తర్వాత ఈ నిబంధనలు దేశవ్యాప్తంగా అమలులోకి వస్తాయని ఐఆర్‌డిఎఐ తెలిపారు. అయితే వెహికల్ బీమా ప్రీమియం పెంచటం విషయంలో గత రెండేళ్లుగా ట్రాఫిక్ చలానాలను పరిగణనలోకి తీసుకొని బీమా ప్రీమియం నిర్వహిస్తున్నట్లు అధికారులు తెలియజేశారు. ఈ విషయాన్ని గుర్తు పెట్టుకొని ఇప్పటికైనా వాహనదారులు ట్రాఫిక్ నిబంధనలను పాటిస్తూ జాగ్రత్త వాహనం నడప వలసిన అవసరం ఉంది.




Next Story